Gaami day 1 collections: గామి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత సాధించిందంటే!

Gaami Collections : యువ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా భారీ అంచనాల మధ్య నిన్న అనగా మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. విద్యాధర్ కాగిత అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అనుకుంటోంది. ఇప్పటిదాకా విశ్వక్ సేన్ నటించిన అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు రికార్డును సృష్టించాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2024, 05:53 PM IST
Gaami day 1 collections: గామి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత సాధించిందంటే!

Gaami first day collections : విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 8న మంచి అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన సినిమా గామి. టీజర్, ట్రైలర్ తోనే  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటువంటి ఒక మంచి పాత్రలో కనిపించారు. సాధారణ ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ దాకా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సినిమా మొదటి నుంచి పూర్తి అయ్యేదాకా డైరెక్టర్ విద్యాధర్ స్క్రీన్ ప్లేను చాలా ఎంగేజింగ్ గా రాసుకున్నారు. 

ఇక ఈ సినిమా కలెక్షన్లు కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ కూడా చాలా బాగుండటంతో సినిమాకి మంచి ఓపెనింగ్ డే కలెక్షన్లు లభించాయి. విశ్వక్ సేన్ మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి అత్యధికమైన మొదటి రోజు కలెక్షన్లు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటి రోజున అంటే మార్చ్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4.5 కోట్లను వసూలు చేసింది. ఇప్పటిదాకా విశ్వక్ సేన్ నటించిన సినిమాలు అన్నిటిలోనూ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎక్కువ. 24 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్లు జరిగింది. ఇక మొదటి రోజే ఈ సినిమా 4.50 కోట్లను వసూలు చేసింది. సినిమా టాక్ కూడా బాగుండడంతో బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టేలా కనిపించడం లేదు.

సినిమా ఇప్పుడు హిట్ అయ్యే దశలో వేగంగా పరుగులు తీస్తోంది. ఒక ఎమోషనల్ పాయింట్ ను తీసుకొని దాన్ని త్రిల్లింగ్ వేలో డైరెక్టర్ చాలా బాగా సినిమాను నడిపించారు. చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. వారాంతమే కాబట్టి సినిమా థియేటర్లు మంచి అక్యూపన్సీ నమోదు చేసుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Also Read: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!

Also Read: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News