X TV App: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఎక్స్' కొత్త రూపంలో దర్శనమిస్తోంది. ఇప్పటికే పిట్ట పోయి 'ఎక్స్' రాగా.. సబ్స్క్రిప్షన్, బ్లూటిక్కు కేటాయింపుకు అనేక ఆంక్షలు.. వినియోగించాలంటే అనేక నియమనిబంధనలు విధించిన విషయం తెలిసిందే. మెటా నుంచి 'ఎక్స్'కు యాజమాన్య బదిలీ జరిగినప్పుడు ట్విటర్ అనేక మార్పులు చోటుచేసుకుంటోంది. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు, కంప్యూటర్లలో కనిపించిన 'ఎక్స్' ఇకపై టీవీల్లో కూడా చూడవచ్చు. ఈ అప్డేట్ను త్వరలోనే పరిచయం చేస్తామని మస్క్ ప్రకటించారు.
Also Read: IBA Hike: బ్యాంకు ఉద్యోగులకు జాక్‌పాట్.. భారీ మొత్తంలో పెరగనున్న జీతాలు.. శనివారం కూడా సెలవు?
'ఎక్స్'కు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఎలన్ మస్క్ ఇచ్చారు. ట్విట్టర్లో పెద్ద పెద్ద వీడియోలు ఇక నుంచి టెలివిజన్లలో చూసుకోవచ్చని ప్రకటించారు. అమెజాన్, శామ్సంగ్ స్మార్ట్ టీవీల కోసం ఎక్స్ టీవీ యాప్ తీసుకువస్తున్నట్లు మస్క్ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద లక్ష్యమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్విటర్లో సందేశాలు రాసుకోవచ్చు.. నాలుగు ఫొటోలు పంచుకోవచ్చు. ఇక చిన్న చిన్న వీడియోలు మాత్రమే పోస్టు చేసుకోవచ్చు. పెద్ద వీడియోలకు 'ఎక్స్'లో అనుమతి లేదు.
కానీ వీడియోలకు ప్రజల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేసుబుక్ల వినియోగంలో వీడియోలు కోట్లలో వ్యూస్ ఉంటున్నాయి. మరి అదే మాదిరి 'ఎక్స్'ను మార్చాలని ఎలన్ మస్క్ భావిస్తున్నట్లు సమాచారం. పెద్ద పెద్ద వీడియోల కోసం టీవీ యాప్‌ను తీసుకువస్తున్నట్లు టెక్నాలజీ ప్రపంచంలో చర్చ నడుస్తోంది. ప్రధానంగా యూ ట్యూబ్‌తో పోటీ పడేందుకు మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్తు సోషల్ మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టీవీ యాప్ ప్రయోగాత్మక దశలో ఉందని 'ఎక్స్' వర్గాలు వెల్లడించాయి. ప్రయోగాల దశ విజయవంతం కావడంతో ఇప్పుడు మస్క్ అధికారిక ప్రకటన చేశారని తెలుస్తోంది. త్వరలోనే 'ఎక్స్' టీవీ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. 2022లో మస్క్ ట్విటర్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. నాటి నుంచి ట్విటర్లో రోజుకో మార్పు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మస్క్ చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. ట్విటర్ వినియోగం భారీగా తగ్గుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter