Minister Komatireddy Venkat Reddy Fires On Ex CM KCR: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఇన్నేళ్ల పాటు వేల కొట్ల కబ్జాలు పెట్టాడని కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంటకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హాయాంలో మల్లారెడ్డి ఫ్యామిలీ అనేక చోట్ల అక్రమ భూదందాలకు పాల్పడ్డారని, అమాయకుల భూములను దోచుకున్నారని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ రావడం మార్పునకు నాందీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. మాజీ సీఎం కేసీఆర్ కు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలనే రిజల్ట్ రోజు నడుము బొక్క విరగొట్టాడంటూ ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఒక బిల్డింగ్ కూలగొట్టగానే, ఎన్నికలలో పోటీచేయట్లేదని అన్నారు. తమను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించిందని గుర్తుచేశారు.
Read More: Delhi Hit And Run Case: తప్పతాగి హల్ చల్ చేసిన టాక్సి డ్రైవర్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో ఇదే..
తాము ఏనాడు కూడా పార్టీ మారే ఆలోచనలు చేయలేదన్నారు. కేవలం ప్రజల కోసం పార్టీ మారి.. తిరిగి ప్రజలకు న్యాయం జరగాలనే మరల పాత పార్టీకి వచ్చానంటూ కోమటి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై కోమటి రెడ్డి తనదైన స్టైల్ లో మరోసారి సెటైర్ వేశారు. దేవుడి మాజీ సీఎం నడుము బొక్క విరగొట్టి పనిష్మెంట్ ఇచ్చాడని, ఇప్పటికైన బీఆర్ఎస్ అహాంకార పూరితమైన మాటలను మానుకోవాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా..తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పథకాలను ప్రజలకు అందించేలా ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా గత బీఆర్ఎస్ పై కూడా విరుచుకుపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read More: Viral Video: చేప ప్రాణాలను కాపాడిన కొంగ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..
ఇక మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ ఆరోపణలకు అంతేఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. ఇక.. ఎంపీఎన్నికల హీట్ కొనసాగుతుంది. అన్ని పార్టీలు తమకే మద్దతు పలకాలని ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక.. కాంగ్రెస్ పాలన కొద్దిరోజులేనంటూ కూడా కామెంట్ లు చేస్తున్నారు. కాగా, ఇటీవల ఎంఐఎం నేత అసదుద్దీన ఓవైస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు పరిపాలంచాలని, తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని కామెంట్లు చేశారు. పాతబస్తీలో మెట్రో పనులు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter