Allu Arjun: వైజాగ్ లో సైతం అల్లు అర్జున్ బిజినెస్.. ఇంతకీ అదేమిటంటే!

Pushpa 2: మన టాలీవుడ్ లో హీరోలు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్ల దగ్గర నుంచి రెస్టారెంట్ల వరకు.. వీళ్లు మొదలుపెట్టని బిజినెస్ లేదు. ఇలా బిజినెస్ లో సైతం రానించడంలో ముందుంటారు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా పరంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2024, 08:14 PM IST
Allu Arjun: వైజాగ్ లో సైతం అల్లు అర్జున్ బిజినెస్.. ఇంతకీ అదేమిటంటే!

Allu Arjun Business: సినిమా సెలబ్రిటీలు సినిమాలతో పాటుగా సైడ్ బిజినెస్ లు కూడా ఎన్నో పెడుతున్నారు. వీటితోపాటు ఇతరుల బిజినెస్ లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల హీరోలు ఎక్కువగా మల్టీప్లెక్స్ బిజినెస్ పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు AMB మల్టీప్లెక్స్, అల్లు అర్జున్ AAA సినిమాస్ ను హైదరాబాదులో ప్రారంభించగా.. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో AVD సినిమాస్ పేరిట భారీ మల్టీప్లెక్స్ ను మొదలుపెట్టారు. అయితే ఈ బిజినెస్ ను ఇరు తెలుగు రాష్ట్రాలలో వ్యాపించేలా వారు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం మల్టీప్లెక్స్ లకు డిమాండ్ బాగా ఉండటంతో వీటినుంచి ఆదాయం కూడా అదే రేంజ్ లో వస్తుంది. ఈ నేపథ్యంలో మిగిలిన అగ్ర హీరోల దృష్టి కూడా మల్టీప్లెక్స్ లపై పడుతుంది. మరోపక్క అల్లు అర్జున్ తన AAA సినిమా బిజినెస్ ను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా మిగిలిన సిటీస్ కి కూడా విస్తరింపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో కూడా తమ బ్రాంచ్ మొదలు పెట్టడానికి అల్లు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల పుష్ప 2 మూవీలో భాగంగా వైజాగ్ కు చేరుకున్న అల్లు అర్జున్ కు అభిమానులు భారీగా ఆహ్వానం పలికారు. 

పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. మరి ముఖ్యంగా మాస్ ప్రేక్షకులలో అతని ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వైజాగ్ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్ కు కానీ విని ఎరుగని రేతిలో ఆదరణ లభించింది.భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైజాగ్ లో కూడా సినిమా బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇక్కడ సినిమా మార్కెట్ ఎప్పుడూ డౌన్ కాదు.. సినిమా ఆడుతుంది అంటే థియేటర్లు కూడా కావాలి కదా. కాబట్టి కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి. అందుకే అల్లు అర్జున్ ఇక్కడ కూడా తమ బ్రాంచ్ పెట్టాలి అని భావిస్తున్నారట.

వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కూడా త్వరలో జరగబోతోంది. ఇక ఈ మాల్ లో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్తో కలిసి తన బ్రాండ్ AAA సినిమాస్ ను ప్రారంభించబోతున్నారని టాక్. హైదరాబాదులో ఉన్న AAA సినిమాస్ లో ఫెసిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. మంచి క్లాసీ లుక్ తో ఉండే థియేటర్.. ఆకట్టుకునే ఇంటీరియర్ తో పాటు అల్లు అర్జున్ ఫోటోలతో సినిమా హాల్ లుక్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. వైజాగ్ లో కూడా అల్లు అర్జున్ తన AAA సినిమాస్ ని ఓపెన్ చేస్తాడు అని తెలిసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Also read: AP & TS SSC Exams 2024: నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News