Butter Milk Benefits 2024: ఎండాకాలంలో రోజు ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరంలో జరిగేది పెద్ద మ్యాజికే!

Butter Milk Benefits 2024 In telugu: ఎండాకాలంలో ప్రతిరోజు మజ్జిగను తాగడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 27, 2024, 06:35 PM IST
Butter Milk Benefits 2024: ఎండాకాలంలో రోజు ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరంలో జరిగేది పెద్ద మ్యాజికే!

 

Butter Milk Benefits 2024 In telugu: ఎండల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీని కారణంగా చాలామందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా డీహైడ్రేషన్ సమస్యతో పాటు అనేక చర్మ సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకొని కొన్ని పోషకాలు కలిగిన డ్రింక్స్ ను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన డ్రింక్స్‌ను అతిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన శీతల పానీయాల కంటే ప్రతిరోజు మజ్జిగ తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మజ్జిగలో ఉండే పోషక గుణాలు శరీరానికి తగిన పోషకాలను అందించడమే కాకుండా.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో తక్కువ కేలరీలు లభిస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా తాగడం వలన మంచి ఫలితాలు పొందుతారు. మజ్జిగలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఎండాకాలంలో మజ్జిగను తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇవే కాకుండా దీనిని తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలు:
జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:

వేసవిలో చాలామంది జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా పొట్ట నొప్పితో పాటు వీరేచనాలు, వాపులు వంటి జీర్ణ క్రియ సమస్యలు వస్తాయి. అయితే దీని కారణంగానే శరీరం కూడా డీహైడ్రేట్ అవుతుంది. ఈ అన్ని సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు వేసవిలో మజ్జిగను తాగడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా కొత్త సమస్యలు రాకుండా జీవ క్రియను రక్షిస్తుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

డీహైడ్రేషన్:
ఎండాకాలంలో డిహైడ్రేషన్ సమస్యలతో బాధపడే వారికి కూడా మజ్జిగ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా మజ్జిగలో పుదీనా కలుపుకొని తాగడం వల్ల డయేరియా, హీట్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు పొట్ట కూడా చల్లబడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎసిడిటీ:
వేసవిలో అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు మసాలా, నూనె కలిగిన ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మందగించి ఎసిడిటీ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.  అంతేకాకుండా కొంతమంది అతిగా ఎక్కువ ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.  అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎండాకాలంలో ప్రతిరోజు మజ్జిగను తాగడం చాలా మంచిది. మజ్జిగ తాగడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News