Auspicious Plants for home: వాస్తు ప్రకారం ఈ 10 మొక్కలు మీ ఇంట్లో ఉంటే డబ్బును మ్యాగ్నెట్‌లా ఆకర్షిస్తాయి.

Auspicious Plants for home: వాస్తు ప్రకారం కొన్ని పూల మొక్కలు మన ఇంటి గార్డెన్లో ఉండాల్సిందే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వాస్తు పరంగా పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు

Written by - Renuka Godugu | Last Updated : Apr 17, 2024, 03:33 PM IST
Auspicious Plants for home: వాస్తు ప్రకారం ఈ 10 మొక్కలు మీ ఇంట్లో ఉంటే డబ్బును మ్యాగ్నెట్‌లా ఆకర్షిస్తాయి.

Auspicious Plants for home: వాస్తు ప్రకారం కొన్ని పూల మొక్కలు మన ఇంటి గార్డెన్లో ఉండాల్సిందే ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వాస్తు పరంగా పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం.

జాస్మిన్..
ఇది మంచి సువాసన వెదజల్లే మొక్క వాస్తు పరంగా కూడా ఈ మొక్క మీ ఇంట్లో ఉండాలి ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.

మనీప్లాంట్..
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్క అందరి ఇండ్లలో ఉంటుంది ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ధనాన్ని ఆకర్షించు శక్తి ఈ మొక్కకు ఉంటుంది. ఇంటికి శ్రేయస్సును ఇస్తుంది కానీ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఏర్పరచుకోవాలి.

మందార మొక్క..
మందార పువ్వు పువ్వు  కాళికామాతకు దుర్గామాతకు ఎంతో ఇష్టమైన పువ్వు వాస్తు ప్రకారం ఈ ఇంటి మొక్కను ఇంటికి తేజస్సును తీసుకువస్తుంది అంతేకాదు ఈ మొక్క ఇంటికి శుభ సూచకం.

తులసి..
 హిందూమతంలో అందరి ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి ఇది హిందూ మతం పరంగా ఎంతో ముఖ్యమైనది తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పూజిస్తారు వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవడంలో ఇంటి పరిసరాలు కూడా గాలి పరిశుద్ధమవుతుంది ఇంట్లో నెగటివ్ తొలగిస్తుంది.

ఇదీ చదవండి: శ్రీరామనవమిరోజు ఈ శక్తివంతమైన మంత్రం పఠిస్తే మీ ఇంట సిరిసంపదలు వెల్లువిరుస్తాయి..
గులాబీ..
గులాబీ మొక్క ప్రేమకు ప్రతిరూపం ఈ పువ్వు మంచి వాసనను వెద జల్లుతుంది అయితే ఇది ముళ్ల మొక్క కాబట్టి ఇంట్లో పెట్టుకోవడం శుభమా? అశుభమా? అని కొందరు భావిస్తుంటారు. అయితే గులాబీ మొక్క మాత్రం ఆనందం, ప్రేమ, పాజిటివ్ ఎనర్జీకి సూచకం.

 బంతి పువ్వు..
వాస్తు పరంగా ఇంట్లో పెట్టుకోవాల్సిన మరో మొక్క బంతి పువ్వు ఈ మొక్క కూడా ఇంటికి శ్రేయస్సును తీసుకొస్తుంది ఇంట్లోంచి నెగటివ్ ఎనర్జీని పారదోలుతుంది.

 తామరపూవు..
 తామర పువ్వు లక్ష్మీదేవికి ప్రతిరూపం ఇందులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు ఇది ఇంట్లో ఆధ్యాత్మికతను, పాజిటివిటీని పెంచుతుంది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తామర మొక్కలు మ్యాజికల్ గుణాలు ఉంటాయి.

చామంతి..
వాస్తు ప్రకారం మరో మొక్క మన ఇంట్లో ఉండాలంటే అది చామంతి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును లకు తీసుకువస్తుంది.

ఇదీ చదవండి:  రామయ్య కల్యాణానికి 'కోడ్‌' అడ్డంకి.. ప్రత్యక్ష ప్రసారానికి నిరాకరణ

లావెండర్..
 లావెండర్ మొక్క పరిసర ప్రాంతంలో సువాసనను వెదజల్లుతుంది ఈ మొక్కతో ఇంటి గార్డెన్ అందంగా కనిపించేలా చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు లావెండర్ మొక్కను ఇంటి పరిసరాల్లో పెంచుకోవాలి. ఇది బెడ్ రూమ్ లో కూడా పెంచుకోవచ్చు ,పాజిటివిటీని పెంచుతుంది.

 ఆర్చిడ్..
 ఆర్చిడ్ కూడా ఇంటి బాల్కనీకి అందాన్ని తీసుకువస్తుంది ఈ పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి ఆర్చిడ్ మొక్క కూడా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది వాస్తు ప్రకారంగా ఇంట్లో ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల ఇంటికి శక్తి రెట్టింపు అవుతుంది(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News