Nani: సుజిత్ తో నాని సినిమా లేనట్టే.. అది కూడా ఆ ఒక్క కారణం వల్లే!

Sujeeth-Nani: ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్న హీరో నాని. ప్రస్తుతం నాని టైర్ 2 టైర్ వన్ హీరోల మధ్య ఊగిసలాడుతూ.. త్వరలోనే టైర్ వన్ హీరోగా మారడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 16, 2024, 10:04 PM IST
Nani: సుజిత్ తో నాని సినిమా లేనట్టే.. అది కూడా ఆ ఒక్క కారణం వల్లే!

Nani Upcoming Movie: నానితో సినిమా చేస్తే తప్పకుండా యావరేజ్ హిట్ అన్న  అవుతుంది అనేది దర్శకుల నమ్మకం. ఎందుకంటే నాని సినిమా కొంచెం బాగున్న ఫ్యామిలీ ఆడియన్స్ చిత్రం చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదే విషయాన్ని ఆయన సినిమా రుజువు చేసింది. నిజానికి హాయి నాన్న సినిమాలో పెద్దగా కథ ఏమీ ఉండదు. కానీ ఈ సినిమాని ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడడంతో ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
అంతేకాకుండా నాని సినిమాలకి ఓటీటీ  డీల్స్ కూడా భారీగానే పలుకుతాయి. 

అయితే అన్నీ బాగానే ఉన్న నానికి ప్రస్తుతం మాత్రం ఒక సినిమా సమస్యగా మారింది. తన మొదలు పెట్టిన సినిమా ఇప్పుడు ఆపేయాల్సి వస్తోంది. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు హీరో నాని. తనకు అంతే సుందరానికి రానికి మంచి విజయం అందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం టీచర్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమా విషయం పక్కనపెడితే.. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే నాని సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో ఓ మూవీ చేయాల్సి ఉంది. సుజిత్ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి చిత్రంతో బిజీగా ఉండడంతో.. మరి కొద్ది రోజులలో సుజిత్, నాని సినిమా షూటింగ్ మొదలవుతుంది అనుకున్నారు అందరూ. ఈ సినిమాని అఫీషియల్ గా నాని పుట్టినరోజు ప్రకటించారు. అయితే, నాని,సుజీత్ కాంబో సినిమా మొదలవకుండానే ఇబ్బందులు వచ్చాయి.నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజీత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారట.
నాని కుడా ఓకే చెప్పడంతో డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌ కింద  డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం సుజిత్ భారీ బడ్జెట్ అడిగినట్టు వినికిడి. అయితే ఇది విన్న తరువాత నిర్మాత మాత్రం, నాని మార్కెట్ బేస్ చేసుకొని అంత బడ్జెట్ పెట్టేందుకు ముందుకు రావట్లేదని సమాచారం. అంతేకాకుండా నాని కూడా మరి అంత పెద్ద బడ్జెట్ వద్దు అని చెప్పారట. కానీ సుజిత్ మాత్రం హై బడ్జెట్ సినిమా తీయాలని పటుపట్టడంతో నాని ,సుజీత్ మూవీ హోల్డ్ లో పడింది అని తెలుస్తోంది.మరి వీరిలో ఎవరన్నా కాంప్రమైజ్ అయ్యి..నాని,సుజీత్ మూవీ సెట్స్ పైకి  వెళ్తుందో లేదో చూడాలి. 

ప్రస్తుతం నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా  క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 29వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News