Actress Hema Latest Reaction Video: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఈరోజు మే 27 న తమ ముందు హజరు కావాలంటూ కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ నటి హేమ మాత్రం తన ఆరోగ్యం బాగాలేదని, వైరల్ ఫీవర్ వచ్చిందని కూడా లాయర్ లతో ప్రత్యేకంగా లేఖను పంపినట్లు తెలుస్తోంది. తనకు మరికొంత సమయం కావాలని కూడా నటి హేమ సీసీబీ పోలీసులకు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ లేఖపై పోలీసులు మాత్రం అంత పాజిటివ్ గా రియాక్ట్ కాలేదు. ఆమెకు మరోక నోటీస్ ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. నటి హేమ.. బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాజిటివ్ వచ్చిన తర్వాత తొలిసారి స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
నటి హేమ వీడియోలో మాట్లాడుతూ... తాను ఎల్లప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటానని చెప్పుకొచ్చింది. తప్పు చేయనంత వరకు కూడా ఎవ్వరికి భయపడోద్దని హేమ అన్నారు. అంతేకాకుండా.. తప్పులు చేయకపోవడానికి దేవుళ్లమేం కాదు కదా అని అన్నారు. ఒక వేళ తప్పులు చేస్తే సారీ చెప్పుకొవచ్చని అన్నారు. కానీ ఒక తప్పును కవర్ చేయడానికి, అబద్ధాలు ఆడితే.. దాన్ని కవర్ చేయడానికి మరిన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుందని కూడా హేమ అన్నారు. ఇప్పుడు మాత్రం..తాను.. చాలా ఒత్తిడితో ఉన్నానని, తొందరలోనే అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందని నటి హేమ చెప్పుకొచ్చారు. అత్యవసరమైతే షూటింగ్ లలో పాల్గొంటానని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ ఘటనలో పోలీసులు 103 మందికి టెస్టులు చేయగా వారిలో 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో నటి హేమకు ఈరోజు తమ ముందు హజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈరోజు ఉదయం నుంచి నటి హేమ, పోలీసుల ముందు హజరవ్వడంపై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. చివరకు ఆమె మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. ఇక రేవ్ ఘటనలో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఆమెకు అండగా నిలిచారు. దోషిగా తేలేవరకు కూడా ఆమెపైన లేని పోనీ ఆరోపణలు చేయకూడదంటూ కోరారు.
అదే విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఇలాంటి వాటిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటుందన్నారు. ఒక వేళ హేమ తప్పు చేసినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపిస్తే అప్పుడు ఆమెపై చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఇక డ్రగ్స్ ఘటన, బెంగళూరు రేవ్ పార్టీలపై తెలంగాణ సర్కారు కూడా స్పందించింది. ఇలాంటి వాటిని అస్సలు వదలొద్దిని,దీని వెనుక ఎంతటి వారున్న కూడా చర్యలు తీసుకొవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.