BJP Action Plan: వీరిద్దరు జంపింగ్ జంపాంగ్‌లే.. బీజేపీ ప్లాన్ బీ ఇదే.. సేఫ్ జోన్‌లో జగన్..!

Chandrababu Naidu and Nitish Kumar: ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. బీజేపీకి బంపర్ మెజార్టీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 6, 2024, 02:07 PM IST
BJP Action Plan: వీరిద్దరు జంపింగ్ జంపాంగ్‌లే.. బీజేపీ ప్లాన్ బీ ఇదే.. సేఫ్ జోన్‌లో జగన్..!

Chandrababu Naidu and Nitish Kumar: దేశవ్యాప్తంగా తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న ఎన్డీఏ కూటమికి.. ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. 400 సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన కూటమిని 292 సీట్లకు పరిమితం చేశారు. ఇక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కీలక పాత్రలు పోషించనున్నారు. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతో కేంద్రంలో భాగస్వామ్యం కానున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు కేంద్ర మంత్రి పదవులు, 2 సహాయ మంత్రులు, లోక్‌సభ స్పీకర్ పదవిని చంద్రబాబు నాయుడు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలక శాఖలైన ఆర్థికశాఖ, ఆరోగ్య శాఖ, విద్యా శాఖతోపాటు వ్యవసాయ శాఖ కావాలని చెప్పినట్లు సమాచారం.  

Also Read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని

2014లోనూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో అప్పుడు ఎన్డీఏ కూటమికి టాటా చెప్పేసి.. కాంగ్రెస్‌తో జత కట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తప్పు తెలుసుకున్న బాబు.. మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించి.. కేంద్రంలో కీ రోల్ పోషించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుకు అపాయిట్‌మెంట్‌ కూడా ఇవ్వని ప్రధాని మోదీ.. ఎన్డీఏ సమావేశంలో పక్కన పెట్టుకుని కూర్చొబెట్టుకోవడం నెట్టింట బాగా వైరల్ అయింది. 

ఇక ఎప్పుడు ఏ పార్టీతో కలిసిపోతాడో తెలియని నితీశ్ కుమార్, కాంగ్రెస్‌తో సత్సంబంధాలు ఉన్న చంద్రబాబు నాయుడితో బీజేపీకి భవిష్యత్‌లో కష్టాలు తప్పకపోవచ్చు. గత పదేళ్లలో పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న బీజేపీ.. ఈసారి ధైర్యం చేసి ముందడగు వేయలేని పరిస్థితి. చంద్రబాబు 16, నితీశ్ 12కి తోడు జనసేన 2 సీట్లను కలుపుకుంటే మొత్తం 30 సీట్లు పోతే.. ఎన్డీఏ బలం 292 నుంచి 262కి పడిపోతుంది. దీంతో బీజేపీకి అధికారం నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. చిన్నచితక పార్టీల మద్దతుతో బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. 

అందుకే బీజేపీ ఇప్పటి నుంచి ప్లాన్ బీని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక చంద్రబాబు, నితీశ్ కాంగ్రెస్ కూటమికి జై కొట్టినా.. వాళ్లకు పూర్తి మెజార్టీ రాదు. ఇతరుల కేటగిరీలో ఉన్న 17 మంది ఎంపీలు కీలకమవుతారు. అదేజరిగితే.. వైఎస్సార్సీపీ నలుగురు ఎంపీలు కచ్చితంగా బీజేపీ వైపు మొగ్గుచూపుతారు. ఎన్డీఏకు చంద్రబాబు దూరమైతే.. జగన్ తప్పకుండా దగ్గరవుతారు. అమిత్ షా, మోదీ రంగంలోకి దిగితే.. అధికారం నిలబెట్టుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. జగన్‌ను మళ్లీ జైలుకు పంపిస్తారేమోనని భయపడుతున్న వైసీపీ నేతలకు ఈ విషయం కాస్త ఊరట కలిగిస్తోంది. జగన్ సేఫ్‌ జోన్‌లోనే ఉంటారని భావిస్తున్నారు. చూద్దాం భవిష్యత్‌లో రాజకీయాలు ఎటు వైపు అయినా మలుపు తిరగవచ్చు. 

Also Read: Allu Arjun: పుష్ప ఫైర్ ఇక తగ్గినట్టేనా.. మొత్తానికి తేలిపోయిన తిక్క

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News