Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?

Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 6, 2024, 04:51 PM IST
Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?

Revanth Phone Call To CBN: బ్రహ్మాండమైన మెజార్టీతో తన గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతుండడంతో రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఫలితాల రోజే ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన రేవంత్‌ రెడ్డి.. రెండు రోజుల అనంతరం స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. ఈ సందర్భంగా యోగక్షేమాలు కనుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అయితే ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహా

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో జనసే, బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబును ఫలితాల వెల్లడి రోజు మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజుల తర్వాత అంటే గురువారం స్వయంగా ఫోన్‌ చేయడం విశేషం.

Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్‌ పే నంబర్‌ అంటూ పిచ్చి రాతలు

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా రేవంత్‌ రెడ్డి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల విభజన హామీలు.. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబును రేవంత్‌ కోరినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం పరస్పరం విరుద్ధ పార్టీల్లో కొనసాగుతున్నారు.

ఇండియాలోకి ఆహ్వానం?
ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రేవంత్‌ రెడ్డి ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్నా కూడా ఇండియా కూటమి కూడా టీడీపీకి గాలం వేస్తోంది. 

ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి ద్వారా చంద్రబాబుకు ఇండియా కూటమి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు కింద రేవంత్ రెడ్డి పని చేయడంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయం ద్వారా రేవంత్‌ ద్వారా చంద్రబాబును ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు చర్చ నడుస్తోంది. ఇండియా కూటమికి టీడీపీ మద్దతు తెలపాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. అయితే అలాంటి చర్చ వారి మధ్య జరగలేదని రేవంత్‌ వర్గీయులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News