Healthy Food: ఈ ఆహారాలు తిన్నారంటే ఎక్కువ కాలం బతుకుతారు.. మీరూ తింటున్నారా?

Healthy Food For Long Life:   మనం ఆరోగ్యంగా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. మన డైట్ లో  కొన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల దీర్ఘాయువు సొంతం అవుతుంది.  కొన్ని ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి. ఈరోజు మనం ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jun 26, 2024, 10:26 AM IST
Healthy Food: ఈ ఆహారాలు తిన్నారంటే ఎక్కువ కాలం బతుకుతారు.. మీరూ తింటున్నారా?

Healthy Food For Long Life:  కొన్ని రకాల ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల దీర్ఘాయువు మీ సొంతం అవుతుంది. ఎలాంటి ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది

 ప్రాసెస్డ్‌ ఫుడ్స్..
కొన్ని నివేదికల ప్రకారం ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తాయి. 2022 అమెరికన్ జర్నల్ ప్రివెంటెడ్ మెడిసిన్ ప్రకారం అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటే 10.5% మంది మరణాలు సంభవించాయి. అది కూడా 30 నుంచి 69 వయస్సు వారు అని తేలింది. ఈ  ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.

వేగన్ ఫుడ్స్..
వేగం డైట్ అనేది చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ 2017 స్టడీ ప్రకారం ప్లాంట్ బేస్డ్‌ డైరెక్టుగా చేర్చుకోవడం వల్ల ఆ గుండెకు కూడా మేలు చేస్తుంది. ఇది కార్డియోవాస్కులర్ సమస్య నుంచి బయటపడతారు. అయితే రీఫైండ్ చేసిన గింజలు విత్తనాలు క్రిస్పీ చిప్స్ షుగర్ వంటి వాటికీ దూరంగా ఉండాలి.

డోనట్స్..

డోనట్స్ లో ఎక్కువ మోతాదులో షుగర్ ఉంటుంది కాబట్టి ఇవి మీ డైట్ లో ఉండకుండా చూసుకోండి. ఇది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఇందులో చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. ఇది శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి మీ డైట్ లో చేర్చుకోకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది కొలెస్ట్రాల్ని కూడా హఠాత్తుగా పెంచేస్తాయి.

వేయించిన పొటాటో..
వేయించిన పొటాటో టేస్టీగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకుంటాం అయితే 2017 నివేదిక ప్రకారం ఇది ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల మరణాల రేటు కూడా పెరిగింది. ఇందులో ట్రాన్స్‌ ఫ్యాట్‌ ఉంటుంది. ఇది కార్డియా వాస్కులర్ సమస్యకు కారణం అవుతుంది.

టోస్టు ..
కాల్చిన టోస్టు కూడా గుండె సమస్యలకు కారణం అవుతుందని యూకే ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ తెలిపింది. టోస్ట్, ఫ్రైడ్, గ్రిల్ వంటి ఆహారాలు క్యాన్సర్ కి కారణం అవుతాయని గ్రిల్ ప్రైడ్ మిక్స్ గ్రిల్ చేసిన ఆహారాలకి కూడా దూరంగా ఉండాలి. ఇందులో కెమికల్స్ వంటి ప్రోటీన్స్ ఉంటాయి చికెన్ ఫిష్, బార్బిక్యు ఎక్కువ మంటపై కుక్ చేస్తారు ఇలాంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

డైరీ..
అంతేకాదు అమెరికన్ జర్నల్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం ఎక్కువ ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు, ఒక చిన్న బోల్ యోగార్ట్‌ మాత్రమే తీసుకోవాలి ఇందులో కాల్షియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్యాట్ కూడా ఉంటుంది దీనికి మించిన మోతాదులు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి అంతేకాదు స్కిన్ సమస్యలు కూడా వచ్చి బరువు కూడా పెరిగిపోతారు.

ఉప్పు..
కొన్ని నివేదికల ప్రకారం ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకున్నా వారిలో ఆయుష్షు తగ్గుతుంది. ఎక్కువ మతాలు తీసుకోవడం వల్ల బిపి కూడా పెరిగిపోతుంది స్ట్రోక్ వంటి సమస్యలు హార్ట్ ఎటాక్ వస్తాయి. దీంతో హార్ట్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది సూప్ సాస్ పిజ్జాస్ వంటి వాటిలో ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటాయి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఇదీ చదవండి:ఈ ఇంటి చిట్కాతోనే ఈజీగా ఇంట్లోనే సిల్కీ హెయిర్ పొందండి..

షుగర్..
బివరేజెస్ కూల్‌ డ్రింక్స్‌లో షుగర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు క్యాన్సర్ డయాబెటిస్ వంటి వస్తాయి. ఈ స్వీట్ పదార్థాలకు దూరంగా ఉండాలని అనేక నివేదికలు తెలిపాయి.యూనివర్సిటీ ఆఫ్ యూకే నివేదిక ప్రకారం గింజలు డైట్లో చేర్చుకోవడం వల్ల దీర్ఘాయువు మన సొంతమవుతుంది. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది గింజలు, విత్తనాలు తృణ ధాన్యాలు మన డైట్ లో ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు.

ఇదీ చదవండి:ఈ సహజ సిద్ధమైన ఫుట్‌ స్క్రబ్స్‌తో మీ పాదాలు మృదువుగా మారిపోతాయి..

మొక్కల ఆధారిత ఆహారాలు తినడం వల్ల కూడా దీర్ఘాయువు ఉంటుంది. ముఖ్యంగా శనగలు, బీన్స్, పాలకూర స్వీట్ కార్న్ బ్రోకోలి ఆస్పర్గస్ ప్రజల స్ప్రౌట్స్ వంటివి డైట్ లో ఉండాలి. మొక్కల ఆధారిత గింజలు వంటివి కూడా మన డైట్ లో ఉంటే మనం దీర్ఘాయువు సొంతం అవుతుంది. ఆలివ్ ఆయిల్ ఎక్ట్ర్సా వర్జీన్‌ను  డ్రెస్సింగ్ వేసుకోవాలి.మన డైట్ లో ఆకుకూరలు పప్పులు ఉంటే కూడా దీర్ఘాయువు పొందుతారు. కేవలం వారానికి ఒకసారి మాత్రమే స్పైసీ ఫుడ్ తీసుకోవాలి. దీని వల్ల బిపి కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు డైట్ లో ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల దీర్ఘాయువు ఉంటుంది గుండె సమస్యలు దరి చేరవు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News