Samantha: హిందీలో మరో ఛాన్స్.. సమంతకు అక్కడ పెరిగిపోతున్న క్రేజ్!

Samantha Bollywood Projects: ది ఫ్యామిలీ మ్యాన్.. వెబ్ సిరీస్ తో హిందీలో కూడా అడుగుపెట్టిన సమంత.. వరుణ్ ధావన్ తో సితడేల్..వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు సమంత మరొక బాలీవుడ్ వెబ్ సిరీస్ కి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు పక్కన పెట్టి సమంత హిందీలో వెబ్ సిరీస్ లతో అందరూ దృష్టిని.. ఆకర్షిస్తుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 29, 2024, 08:00 AM IST
Samantha: హిందీలో మరో ఛాన్స్.. సమంతకు అక్కడ పెరిగిపోతున్న క్రేజ్!

Samantha Web Series: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత.. గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులకి దూరంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో మంచి హిట్ అందుకున్న సమంత.. మళ్ళీ బాలీవుడ్ ప్రాజెక్టుల తోనే బిజీ అయిపోయింది. 

ఒకవైపు ఆరోగ్య పరిస్థితుల కారణంగా కూడా కెరియర్ లో నెమ్మదించిన సమంత.. బాలీవుడ్ లో మాత్రం వరసగా ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం సమంత.. వరుణ్ ధావన్ హీరోగా.. నటిస్తున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ కి..దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. 

ఈ వెబ్ సిరీస్ ఇంకా విడుదల కూడా కాలేదు కానీ.. సమంత.. మరొక వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్.. ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ హీరో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా రక్త బీజ్ అనే వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకులు.. ముందుకి రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా కూడా సమంతనే నటించనుంది. 

ఇలా ఒకదాని తర్వాత మరొక వెబ్ సిరీస్ సైన్ చేసుకుంటూ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. అయితే వెబ్ సిరీస్ లు మాత్రమే చేస్తున్న సమంత హిందీ సినిమాలలో ఎప్పుడు అడుగుపెడుతుంది.. అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. సినిమాలకి సంబంధించి కూడా సమంత పలు స్క్రిప్ట్ లు.. వింటున్నట్లు తెలుస్తోంది.. కానీ ఇంకా ఏది ఓకే అవలేదు. 

మరోవైపు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడవ సీజన్లో కూడా సమంతా నటిస్తుంది.. అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. దీనికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థతో సమంతా ఇప్పుడు నిర్మాతగా కూడా మారబోతుంది 

తన సొంత నిర్మాణ బ్యానర్ లో సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News