Harish rao hot comments on both telugu states cm’s: తెలుగు రాష్ట్రాలలో తొందరలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకొనుంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీల మధ్య విభజన పూర్తి అయిన తర్వాత కూడా కొన్ని సమస్యలు మాత్రం ప్రాపర్ గా పరిష్కారం లేకుండానే మిగిలిపోయాయి. వీటిని పరిష్కరించుకునే విధంగా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇటీవల తెలంగాణ గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ ఏపీకి వెళ్లినప్పుడు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య క్వశ్చన్ మార్కులా మిగిలిపోయిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
అయితే.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి అయిన విషయం తెలసిందే. దీంతో ఇప్పటికి కూడా అనేక సమస్యలు అదే విధంగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు, సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులు ఇద్దరు చొప్పున హజరుకానున్నారు. ప్రధానంగా విభజన సమస్యలు,కేంద్రం నుంచి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, మొదలైన వాటిపై చర్చిస్తారని తెలుస్తోంది. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజనపై కూడా చర్చలు జరుపుతారని సమాచారం.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు మంచి చేకూర్చే దిశగా, ఎలాంటి భేషజాలకు పోకుండా మాట్లాడి, సమస్యలను పరిష్కరించుకుంటామని కూడా ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఇద్దరు సీఎంల సమావేశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాపాలన అంటూ ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణలో ప్రజాపాలన అంటూ ప్రజల్ని నట్టేటా ముంచారంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గ్రామపంచాయతీల పాలనను అస్తవ్యస్తం చేసిందన్నారు. సర్పంచ్ లకు బిల్లులుచెల్లించుకుండా ఇబ్బందులు కల్గిస్తున్నారని ఆరోపణలుచేశారు.
తమ హయాంలో గ్రామాలకు 275 కోట్లు కేటాయించామని , కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంచాయతీపాలనను గాలికొదిలేసిందన్నారు. బీఆర్ఎస్ గతంలో పట్టణాలలో.. 1700 కోట్లు,గ్రామాలకు 3300 కోట్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ సర్కారు 7 నెలలు గడిచిన కూడా నిధులు కేటాయించలేదని ఎద్దేవా చేశారు.
ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పారిశుధ్ద కార్మికులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని హరీష్ రావు అన్నారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన ఇదేనా.. అంటూ ఎద్దేవా చేశారు. అవ్వాతాతలకు జీతాలు ఇవ్వకుండా తెగ ఇబ్బందులు పెడుతున్నారని హరీష్ విమర్శిస్తున్నారు. ఏపీలో విభజన సమస్యలన్ని పరిష్కరించుకొవాలని హరీష్ డిమాండ్ చేశారు.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
ఉమ్మడి ఆస్తులు, పరిపాలన భవనాలు, అధికారుల స్థానాల మార్పులు మొదలైనవన్ని కూడా సామరస్యంగా పరిష్కరిచుకుని ప్రజలకు న్యాయం చేయాలని హరీష్ రావు అన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే చంద్ర బాబు అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసి, దానిని సోమవారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వీరి భేటీ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి