Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం.. ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..

Pawan kalyan varahi deeksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్షను విజయవంతంగా ముగించుకున్నారు.. ఈ క్రమంలో ఆయన నిన్న మంగళగిరి కార్యాలయంలో సూర్యరాధన కూడా చేశారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jul 6, 2024, 02:56 PM IST
  • చాతుర్మాస్య వ్రతంలో పవన్ కళ్యాణ్..
  • నాలుగు నెలల పాటు కఠిన నియమాలు..
Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం.. ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..

Pawan kalyan chaturmasya vrata deeksha details: ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో పట్టం కట్టారు. దీనిలో భాగంగా సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ లను పాలనలో తమ మార్కును చూపించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో ఏపీ అన్నిరంగాల్లో వెనక్కు వెళ్లిందని కూటమి నేతలు పలు మార్లు విమర్శలు చేశారు. ఏపీకి పూర్వవైభవం తెవడానికి అందరు కలిసి ముందుకు రావాలని కూడా సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read more: Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

ఈ క్రమంలో ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను చేపట్టారు. మనం చేసే ఏ పనికైన దైవ బలం కూడా తోడుగా ఉంటే ఆ పనులు నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాయని పవన్ భావిస్తుంటారు. దీనిలో భాగంగానే వారాహి దీక్షను ఎంతో కఠిన నియమాలతో పదకొండు రోజుల పాటు ఉన్నారు. ఈ దీక్ష సమయంలో కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటూ, అమ్మవారినామస్మరణే పవన్ చేసేవాడని ఆయన టీమ్ చెబుతుంటారు.

అంతేకాకుండా.. ఇటీవల తెలంగాణకు కొండగట్టుకు వచ్చి పవన్ అంజన్న సన్నిధిలో మొక్కులు తీర్చుకున్నారు. ఇక మరోవైపు నిన్న మంగళగిరిలో పార్టీ ఆఫీస్ లో ఆదిత్యారాధన కూడా చేశారు. సూర్యుడు మనకు కంటి ముందు కన్పించే దేవుడు. వెలుతులు లేకుండా మనం జీవితాన్ని ఊహించుకోలేం. శ్రీరాముడంతటి వారు సూర్యారాధన చేసి, రావణుడిని హతమార్చాడు. దేశప్రజలకు మంచి జరగాలని, ప్రజలు సిరిసంపదలతో ఉండాలని, అన్నిరంగాలలో డెవలప్ మెంట్ జరగాలని కోరుకుంటూ పవన్ వారాహి దీక్ష ను చేపట్టారని ఆయన టీమ్ చెప్తుంటారు.

ఇదిలా ఉండగా.. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష... వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పవన్‌ కల్యాణ్‌ వారాహి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఏక హారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు.

వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ్‌ శర్మ, వేణుగోపాల శర్మ పూజాక్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ క్రమంలో..పవన్‌ కల్యాణ్‌ ఇక మీదట చాతుర్మాస దీక్షలో ఉంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. చాతుర్మాస దీక్షను రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ దీక్ష ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీయిజమాసం కలిసి నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభ తిధుల్లో మాత్రం దీక్షా వస్త్రాలు ధరిస్తారని ఆయన టీమ్ వెల్లడించారు.

చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి..

ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజు ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది. ఈకాలంలోనే విష్ణుమూర్తి పాల సముద్రంలో శయనిస్తాడు. అందుకే ఈ రోజున దేవశయని ఏకాదశి అని కూడా అంటారు.ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలంగా చెప్పుకుంటారు. ఈ కాలంలో కొన్ని నియమాలు పాటిస్తే, ఆ దేవుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు.

చాతుర్మాస్యంలో  ఆహార నియమాలు..

ముఖ్యంగా ఆకు కూరలు, పెరుగు, పాలు, పప్పు వంటివి తినకూడదు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆకు కూరలు, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు తినరాదు. అలాగే వెల్లుల్లి, టమాట, సొరకాయ తినకూడదు. వంట కోసం ఆవనూనె ఉపయోగించకూడదని పండితులు చెబుతుంటారు.

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

చాతుర్మాస్య వ్రత నియమాలు

ఈ వ్రతం చేసే వారు నాలుగు మాసాల పాటు, గ్రామ పొలిమేర దాటకూడదు. ఇక చాతుర్మాస్య వ్రతంలో భాగంగా ఉదయాన్నే స్నానం చేయాలి. క్షురకర్మలు చేయరాదు. నాలుగు నెలలు బ్రహ్మచర్యం పాటించాలి. రోజూ ఒకే పూట భోజనం చేయాలి. ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండాలి. నేలపై పడుకోవాలి. అహింస పాటించాలి. యోగాభ్యాసం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇష్టదేవతల అష్టోత్తర శత, సహస్ర నామావళి పారాయణం చేయాలి. చాతుర్మాస్య వ్రతం ఆచరించే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని, మోక్ష ప్రాప్తి కల్గుతుందని కూడా పద్మ పురాణం చెబుతోంది. అందుకే చాలా మంది చాతుర్మాస్య వ్రతం ను భక్తితో ఆచరిస్తారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News