Who is Praneeth Hanumanthu: సోషల్ మీడియాని కొంతమంది మంచి కోసం ఉపయోగిస్తే.. మరి కొంతమంది విచ్చలవిడిగా వాడుతున్నారు. ఆ రెండో కోవా కి చెందిన వాడే ప్రణీత్ హనుమంతు. ఇతను చేసిన ఘనకార్యం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా.. మొత్తం ప్రణీత్ హనుమంతు పేరు వినిపిస్తోంది. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ గా, చిన్న చిన్న పాత్రలు చేసే నటుడిగా.. ప్రణీత్ హనుమంతు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కామెడీ పేరుతో.. చేసిన ఒక వికృత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెలబ్రిటీల నుంచి.. మామూలు జనం వరకు.. అందరూ ప్రణీత్ హనుమంతు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ.. గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ.. దానిని అపహాస్యం చేస్తూ.. ప్రణీత్ వేసిన జోకులు, నీచమైన కామెంట్ల పట్ల.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని, అలాంటి ఆలోచనలు ఉన్న ఒక నీచమైన వ్యక్తి.. సమాజంలో ఒక పురుగు కంటే హీనం.. అంటూ చాలామంది కామెంట్లు చేశారు.
సెలబ్రిటీలు కూడా ఈ విషయం గురించి సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సాయి ధరంతేజ్, మంచు మనోజ్ వంటి.. సెలబ్రిటీలు అతని మీద తక్షణమే చర్యలు చేపట్టాలి.. అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉన్నత అధికారులను సోషల్ మీడియా ద్వారా కోరారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఈ విషయం గురించి స్పందించారు.
ప్రణీత్ హనుమంతు ఎవరు?
అసలు ఇంతమంది మనోభావాలు దెబ్బతీసిన అతను ఎవరు.. అని చాలామందికి తెలియదు. అతని పేరు ప్రణీత్ హనుమంతు. అతని తండ్రి.. హెచ్ అరుణ్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో.. ఉన్నతాధికారిగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు. కానీ ఆయన కొడుకు మాత్రం.. యూట్యూబ్ వేదికగా.. రోత వీడియోస్ చేస్తూ ఆయనకు చెడ్డ పేరు.. తీసుకువస్తున్నాడు.
ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా ఒక యూట్యూబర్. ఏ జూడ్ అనే ఛానల్ తో.. స్టైలింగ్ టిప్స్ ఇస్తూ ఉంటాడు. యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న.. ప్రణీత్.. సినిమాల్లో కూడా నటించాడు. ఈ మధ్యనే సుదీర్ బాబు హీరోగా నటించిన హరోం హర.. సినిమాలో కూడా కనిపించాడు.
ఇలా చిన్నచిన్న కామెడీ వీడియోలు, సినిమాలతో పేరు తెచ్చుకున్న ప్రణీత్ ఫేమ్ తో పాటు.. కామెడీలో వ్యంగ్యం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక వీడియోలో మాట్లాడుతూ.. తండ్రి కూతుర్ల మధ్య ఉండే ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు.
సోషల్ మీడియా మొత్తం అతనికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుండడంతో.. ప్రణీత్ ఇప్పుడు ప్లేట్ మార్చి తాను చేసింది కామెడీ కాదు అని, దానిని డార్క్ హ్యూమర్ అంటారు.. అంటూ ఇప్పటికీ కూడా సిగ్గు లేకుండా తనని తాను సమర్ధించుకుంటూ క్షమాపణల వీడియో పెట్టాడు. ఇప్పటికి కూడా ఏ మాత్రం పాశ్చాతాపం చూపించకపోవడంతో.. నెటిజన్లు అతనిపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి