Pawan Kalyan: ఆ ఒక్క సినిమాని మాత్రం పక్కనపెట్టేసిన పవన్.. అయోమయంలో నిర్మాత!

Pawan Kalyan Upcoming Movies: తెలుగు సినీ ఇండస్ట్రీలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. గత కొద్ది కాలంగా.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్.. లైన్ అప్ లో భారీ చిత్రాలు ఉన్నాయి. మరి వీటిలో పవన్ వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మీకు తెలుసా? 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 1, 2024, 01:14 PM IST
Pawan Kalyan: ఆ ఒక్క సినిమాని మాత్రం పక్కనపెట్టేసిన పవన్.. అయోమయంలో నిర్మాత!

Hari Hara Veera Mallu Update: ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ డిఫరెంట్‌గా ఉంది.. బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి లాంటి చిత్రాల తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో తీసే సినిమా‌ల స్కోప్ బాగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అగ్ర హీరోలు.. అందరూ సాలిడ్ లైన్ అప్‌తో రాబోయే రోజులలో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. యువ హీరోలతో పాటు సీనియర్ హీరోలు సైతం పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టేస్తున్నారు. మరికొందరు బిగ్ స్టార్స్ ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా సినిమా‌లోకి దిగుతున్నారు.

అలాంటి స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. లోకల్‌గా ఆయనకు సాలిడ్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు పవన్ పాన్ ఇండియా  రేంజ్ సినిమాలో చేయలేదు. అయితే ఇప్పుడు మొత్తం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సెట్స్ మీద ఉన్న ఈ మూడు సినిమాలలో రెంటికి సీక్వెల్స్ కూడా చేయాల్సి ఉంటుంది.ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు  లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు.. ఒకే.. చెబితే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.

ప్రచారం, ఎన్నికలు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. ఇలా వరుస బాధ్యతల మధ్య పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూడడం లేదు. ఇక త్వరలో పవన్ తిరిగి తన చేతిలో ఉన్న సినిమాలను మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే లైన్లో ఉన్న ఈ మూడు సినిమాలలో.. ఒక సినిమాకి మాత్రం పవన్.. హ్యాండ్ ఇస్తున్నట్లు టాక్. మిగిలిన రెండు సినిమాలు మొదలు పెట్టడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ పట్టించుకోని ఆ సినిమా ఏమిటో తెలుసా? 

పవన్ చేస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లును ప్రస్తుతానికి పవన్ పట్టించుకునే ఉద్దేశంలో లేడని టాక్. ముందుగా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిలింనగర్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ మూడు సినిమాలలో ఈ సంవత్సరం విడుదలయ్యే చిత్రాలలో వీరమల్లు కూడా ఒకటి అని ఇప్పటికే.. అనౌన్స్ కూడా చేశారు. ఇటువంటి సమయంలో పవన్ ఈ సినిమాను ఇంకా హోల్డ్‌లో ఉంచడం గమనార్హం. అంతేకాదు పవన్ ఇలా ఆలస్యం చేస్తూ వస్తుండడంతో.. ఈ చిత్రం నిర్మాత ఎ.ఎం.రత్నంపై భారం ఎక్కువగా పడుతుంది. మరి ఇన్ని రోజులు పవన్ కోసం ఎదురుచూస్తున్న ఈ మూవీ టీం ఏం చేస్తారో చూడాలి. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కారణం.. ఏమిటి అన్న విషయంపై స్పష్టత లేదు. మరోపక్క డిప్యూటీ సీఎం‌గా బాగా బిజీ అయిపోయిన పవన్ సినిమాలకు డేట్స్ ఎలా మేనేజ్ చేస్తారు అన్న విషయం కూడా హాట్ టాపిక్‌గా మారుతోంది.

Read more: Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News