Traffic Alerts In Hyderabad: మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొద్దిపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం సాయంత్రం నుంచి కురస్తున్న భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు ప్రాంతాల్లో గంటల తరబడి వాహనదారులు రోడ్లుపై గడపాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అలర్ట్ జారీ చేసింది. రోడ్లపై వరద నీరు నిలిచిందని ప్రయాణికులు హెచ్చరించింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయ్యిందని వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన వరదనీరును క్లియర్ చేసే పనిలో నిమగ్నమైంది జీహెచ్ఎంసి.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం :
భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దమీర్ పూరా దర్వాజా, దబీర్ పురా వంతెన మధ్య భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో వరదనీటిని క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అంబర్ పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం:
అటు ఎన్ఎండీసీ ప్రాంతంలో కూడా భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్ సమస్య ఉంది. ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి నీటి ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మలక్ పేట గంజ్ రిలయన్స్ డిజిటల్, నల్లగొండ ఎక్స్ రోడ్డు, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అంబర్ పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో NH-163 లో 6 No జంక్షన్ నుండి గోల్నాక జంక్షన్ వరకు జరుగుతున్న నిర్మాణం జరుగుతుంది. ఈ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Also Read :Coconut embryo Benefits: షుగర్ పేషంట్లు కొబ్బరి పువ్వు తింటే..ఇన్సులిన్ అవసరమే ఉండదు
#HYDTPinfo #TrafficUpdate
Due to heavy #Rain #waterlogging near NMDC.
Commuters are requested to take alternate route due to slow movement of traffic.
Asif Nagar Traffic Police and #DRF team clearing #waterlogging and regulating traffic. pic.twitter.com/ovOzKnvYvi— Hyderabad Traffic Police (@HYDTP) August 20, 2024
పిడుగుపాటుకు ఇద్దరు మృతి:
జోగుళాంబ గద్వాల్లో వర్షంలో పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. గట్టు, మల్దకల్లో వ్యవసాయ పొలాల్లో పనిచేస్తున్న వ్యక్తులపై పిడుగుపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
రానున్న రోజుల్లో భారీ వర్షం:
హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆగస్టు 20 ఆదిలాబాద్ , కొమురం భీమ్ అసిఫాబాద్, హైదరాబాద్ లో మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 24, 25 తేదీల్లో కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read : Pharma Stock : ఈ ఫార్మా స్టాక్ కొనమని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సిఫార్సు చేసింది..టార్గెట్ ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి