Shakhahaari Aha OTT Streaming: ఆహా ఓటీటీలో కన్నడ బ్లాక్ బస్టర్ ‘శాఖాహారి’ స్ట్రీమింగ్.. సూపర్ రెస్పాన్స్..

Shakhahaari Aha OTT Streaming: తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో వివిధ భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ కోవలో కన్నడలో రీసెంట్ గా హిట్టైన ‘శాఖాహారి’ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 24, 2024, 05:05 PM IST
 Shakhahaari Aha OTT Streaming: ఆహా ఓటీటీలో కన్నడ బ్లాక్ బస్టర్ ‘శాఖాహారి’ స్ట్రీమింగ్.. సూపర్ రెస్పాన్స్..

Shakhahaari Aha OTT Streaming: గత కొన్నేళ్లుగా వివిధ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.అందులో కన్నడ సినిమాలు ఇపుడు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సిరీస్ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఈ సినిమా రీసెంట్ గా ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ కన్నడ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది.

అటు ‘కాంతార’ సినిమా కూడా జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ సినిమా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో జాతీయ అవార్డు గెలుచుకుంది. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు రిషబ్ శెట్టి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. దీంతో మరోసారి జాతీయ స్థాయిలో కన్నడ సినిమాలు సత్తా చూపించాయి. తాజాగా ఈ కోవలో కన్నడనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘శాఖాహారి’. ఈ సినిమాను తెలుగులో థియేట్రికల్ గా కాకుండా ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

 కన్నడలో హిట్టైన ‘శాఖాహారి’ సినిమాను తెలుగులో హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత బాలు చరణ్ తెలుగులో డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ చేసారు. అంతేకాదు తెలుగు నేటీవిటీ దగ్గరగా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు తెలుగు ఆడియన్స్ కు తెలిసిన గొప్పరాజు రమణ చేత డబ్బింగ్ చెప్పించడంతో ఈ సినిమా  చూస్తున్నంత సేపు ఎక్కడా డబ్బింగ్ చిత్రంలా అనిపించదు.

సందీప్ సుంకడ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రంగాయన రఘు లీడ్ రోల్లో యాక్ట్ చేవారు. ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో గోపాలకృష్ణ పాండే, వినయ్, నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News