Dates for Health: మగవాళ్లు ఖర్జూరం ఎందుకు తినాలి, ఏ లాభాలున్నాయి

Dates for Health: ఏడారి దేశపు ఫ్రూట్ ఖర్జూరం బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. ఇందులో దాదాపు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యపరంగా అన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవారి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 25, 2024, 05:35 PM IST
Dates for Health: మగవాళ్లు ఖర్జూరం ఎందుకు తినాలి, ఏ లాభాలున్నాయి

Dates for Health: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అందించే బెస్ట్ ఫ్రూట్. రక్త హీనత, అలసట వంటివి దూరం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. రోజూ పరగడుపున ఖర్జూరం తినడం వల్ల చాలా లాభాలున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారమైతే మరణం తప్ప అన్నింటికీ ఖర్జూరంతో పరిష్కారముందంటారు. 

ఖర్జూరం డ్రై లేదా వెట్ ఏ రూపంలో తీసుకున్నా అంతే లాభదాయకం. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా చాలా ఉంటాయి. ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి కారణమౌతుంటాయి. ఖర్జూరంలో నేచురల్ షుగర్ ఉన్నందున ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. తీపి తినాలనే కోరిక ఉంటే ఖర్జూరం చాలా మంచిది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కనీసం 2 ఖర్జూరం పండ్లు తినడం వల్ల ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పురుషుల్లో కొత్త ఎనర్జీ వస్తుందంటారు.

రోజూ ఖర్జూరం పరగడుపున తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్ కారణంగా రక్త హీనత సమస్య తలెత్తదు. ఇందులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల గర్భిణీ మహిళలకు చాలా మంచిది. బరువు తగ్గించుకునే ఆలోచన ఉంటే ఇది మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఖర్జూరం తినడం వల్ల ఓవర్ ఈటింగ్ లేదా క్రేవింగ్ తగ్గుతుంది. దాంతో బరువు నియంత్రణలో ఉంటుంది. 

ఖర్జూరం తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ కొరత ఏర్పడదు. దాంతో ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారిన ఎనీమియాను దూరం చేయవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు దూరం చేసేందుకు ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. మలబద్ధకం దూరమౌతుంది. అజీర్తి సమస్య ఉండదు.

అన్నింటికంటే ప్రధానంగా ఖర్జూరం మగవారి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆయుర్వేదం ప్రకారం మగవారిలో స్టామినా పెంచేందుకు ఖర్జూరం తిన్పిస్తారు. ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల మగవారిలో ఫెర్టిలిటీ పెరుగుతుంది. దీనికోసం రోజుకు 2-3 ఖర్జూరం పండ్లు పాలలో ఉడికించి తాగాలి. దీనివల్ల శక్తి లభించడమే కాకుండా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అంతేకాదు. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. దాంతో డయాబెటిస్ సమస్య కూడా అదుపులో ఉంటుంది. 

Also read: Juice Precautions: బ్రేక్‌ఫాస్ట్‌తో ఈ 5 జ్యూస్‌లు ప్రమాదకరం, తస్మాత్ జాగ్రత్త

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News