King Kobra: ఇంటి పెరట్లో చెట్టుపై బుసలు కొడుతున్న 12 అడుగుల కింగ్‌ కోబ్రా.. ఏం చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..!

12 Feet King Kobra Viral Video: సాధారణంగా పాములు అంటేనే విషజీవాలు. వీటివల్ల ఏటా ఎంతోమంది తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అయితే, ఇవి మాములుగా అయితే, జనజీవనంలోకి రావు. ఎందుకంటే అవి కూడా మనుషులను చూసి భయబ్రాంతులకు గురవుతాయి. అయితే, సోషల్‌ మీడియాలో ఓ పాము మాత్రం ఇంటి పెరట్లో నక్కింది. 

Written by - Renuka Godugu | Last Updated : Sep 3, 2024, 11:13 AM IST
King Kobra: ఇంటి పెరట్లో చెట్టుపై బుసలు కొడుతున్న 12 అడుగుల కింగ్‌ కోబ్రా.. ఏం చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..!

 12 Feet King Kobra Viral Video:  అసలే వర్షాకాలం, వరద విలయం ఎటు చూసినా నదులు చెరువులు ఏరులై పారుతున్నాయి. భూమిలోపల, అడవుల్లో ఉండాల్సిన జంతువులు కూడా ఈ వరద విలయానికి తట్టుకోలేక దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో కొన్ని జంతువులు జీవాలు జనజీవనంలోకి దారితప్పి వస్తున్నాయి. అలాంటి ఓ ఘటనే కర్నాటకలో జరిగింది. ఓ 12 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా ఇంటి పెరట్లో నక్కింది. ఆ ఇంటివారు ఆ భారీ విషసర్పాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. విషయం తెలిసిన చుట్టుపక్కలవారు కూడా భయబ్రాంతులకు లోనయ్యారు. 

కర్నాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కొందరు గ్రామస్థులు రోడ్డుపై ఓ పాము వెళ్తుండటం గమనించారు. అది కాస్త ఓ ఇంటి పెరట్లోకి దూరింది. చెట్టుపైకి ఎక్కి బుసలు కొడుతూ కనిపించింది. ఆ భారీ 12 అడుగుల పామును గుర్తించిన ఆ ఇంటి సభ్యులు వెంటనే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వారి సహాయం తీసుకున్నారు. వారు వెంటనే పాము ఉన్న ప్రదేశానికి వచ్చారు. చెట్టుపై బుసలు కొడుతున్న పామును చాలా చాకచక్యంతో వారు పట్టుకున్నారు.

ఇదీ చదవండి: స్పీడ్‌ పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. రూ. 350 లోపు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌తో జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్‌ ఛాలెంజ్‌..  

పాము ఇంట్లోకి వచ్చినప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులను కూడా వారు అక్కడ ఉన్నవారికి సూచించారు. ఫారెస్ట్‌ బృందం వెంటనే పామును ఓ కర్ర సహాయంతో చెట్టు నుంచి బయటకు తీశారు. ముందుగానే ఓ పెద్ద కవర్‌, దానికి పైపు అమర్చిపెట్టారు. వెంటనే పామును కర్ర సహాయంతో చెట్టుపై నుంచి తీసి ఆ బ్యాగ్‌లోకి వదిలారు. ఆ భారీ కింగ్‌ కోబ్రా బ్యాగ్‌లోకి దూరింది. వెంటనే ఆ కవర్‌ను సీల్‌ చేశారు అటవీశాఖ అధికారులు. 

ఈ దృశ్యం చూసిన చుట్టుపక్కలవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ భారీ కింగ్‌ కోబ్రాను తీసుకెళ్లి అడవిలో వదిలేశారు అటవీశాఖ అధికారులు. ఈ ఉదాంతం మొత్తం ఓ బ్లాగ్‌ రాసుకువచ్చారు అజయ్‌ గిరి. సమయానికి స్పందించి సమాచారం అందించిన వెంటనే వెళ్లాం. దీంతో అక్కడ ఎలాంటి ప్రాణాపాయ స్థితులు చోటు చేసుకోలేదు. అక్కడ ఎప్పుడైనా పాములు ఇంట్లోకి చొరబడితే చేయాల్సిన చేయకూడని పనులు గురించి కూడా స్థానికులకు వివరించాం అని రాసుకు వచ్చారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Giri (@ajay_v_giri)

ఈ అజయ్‌ గిరి అనే వ్యక్తి తరచూ సోషల్ మీడియాలో ఇలాంటి విషపూరిత స్నేక్స్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు. ఇతనికి సోషల్‌ మీడియాలో ఎంతో మంది ఫాలోయర్స్‌ ఉన్నారు. అయితే, ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఫారెస్ట్‌ అధికారుల బృందం ఎంతో చాకచక్యంగా 12 అడుగుల అతిపెద్ద కింగ్‌ కోబ్రాను కట్టడి చేసి పట్టుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News