7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీఏ పెంపుపై ప్రకటన జారీ చేయనుంది. ఈ నెల అంటే సెప్టెంబర్ జీతంతోనే పెరిగిన డీఏను అందుకోనున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా గిఫ్ట్ లభించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది. మొదటిది జనవరి నెలలో రెండవది జూలై నెలలో. జనవరి నెల డీఏ పెంపు మార్చ్ నుంచి ఎరియర్లతో సహా అమలైంది. ఆ సమయంలో 4 శాతం డీఏ పెరగడంతో 50 శాతానికి చేరుకుంది. ఇక ఇప్పుడు జూలై డీఏ పెంపు ప్రకటన జారీ కావల్సి ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలలోనే ఉండవచ్చు. అంటే ఈ నెల జీతంతో పెరిగిన డీఏను ఎరియర్లతో సహా అందుకోనున్నారు. ఉద్యోగులకు దసరా గిఫ్ట్ ముందే అందనుంది. ఈసారి డీఏ 3-4 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. అంటే మొత్తం డీఏ ఈసారి 53-54 శాతానికి చేరుకోవచ్చు.
ఏఐసీపీఐ సూచీ ప్రకారం డీఏ పెంపు 3 శాతం ఉండవచ్చు. కానీ 4 శాతం చేసినా ఆశ్చర్యం లేదు. అటు పెన్షనర్లకు డీఆర్ కూడా 3-4 శాతం పెరిగే సూచనలు ఉన్నాయి. డియర్నెస్ అలవెన్స్ అంటే డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేది కాగా, డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ పెన్షనర్లకు ఇస్తారు. డీఏ 50 శాతం దాటితే కనీస వేతనంలో కలపకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హెచ్ఆర్ఏ కూడా పెరగవచ్చని తెలుస్తోంది. మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డీమాండ్ చేస్తున్నారు.
డీఏ 3 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఏకంగా 20,484 రూపాయలు పెరగనుంది. అది కూడా సెప్టెంబర్ నుంచి పెరగనుండటంతో దసరాకు ముందే బంపర్ బహుమతి లభించినట్టవుతోంది.
Also read: CBI Arrests Sandip Ghosh: ఆర్జి కర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.