Chiranjeevi: తెలుగు హీరోలు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రీసెంట్ గా కేరళలోని వాయనాడ్ లో జరిగిన ప్రకృతి బీభత్సానికి స్పందించి తమ వంతు సాయం అందించారు. తాజాగా తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలతో ప్రజలు రోడ్డున పడ్డారు. పుట్టకొకరు, చెట్టుకొరకు అన్నట్టు పరిస్థితి తయారైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు హీరోలు ముందుకొచ్చి తమ వంతుగా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు చెరో రూ. 50 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, అసౌకర్యంతో పాటు కష్టాలు తనను కలిచివేసినట్టు చెప్పుకొచ్చారు. పదుల సంఖ్యతలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వంతుగా శాయశక్తుల కృషి చేస్తూ సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపొచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రక్రియలో తన వంతుగా ప్రజలకు తోడ్పడే విధంగా నా వంతుగా రూ. కోటి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ పండ్ కు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించినట్టు చెప్పుకొచ్చారు. ఈ విపత్కర పరిస్థితులు ఎంత వీలైతే అంత తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
మనందరం ఏదో…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ .. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి ఆర్ధిక సాయం ప్రకటించారు. అటు నందమూరి బాబాయి బాలకృష్ణ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయిల విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.
అటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ లో వరద బాధితుల సహాయార్ధం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సొంతం రూ. కోటి విరాళం అందించారు. అటు నారా భువనేశ్వరి కూడా రూ. 2 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అటు త్రివిక్రమ్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు తెలుగు రాష్ట్రాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించిన తెలిసిందే కదా. అటు విశ్వక్ సేన్..చెరో రూ. 5 లక్షలు.. అటు సిద్దు జొన్నలగడ్డ రూ. 10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.