Ganesh Chaturthi 2024: వినాయక చవితి నుంచి ఈ 4 రాశులవారికి గోల్డెన్‌ డేస్ ప్రారంభం!

Ganesh Chaturthi 2024 Lucky Rasi Phalalu: వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి గణేషుడు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే ఈ చవితి సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 5, 2024, 11:26 AM IST
Ganesh Chaturthi 2024: వినాయక చవితి నుంచి ఈ 4 రాశులవారికి గోల్డెన్‌ డేస్ ప్రారంభం!

 

Ganesh Chaturthi 2024 Lucky Rasi Phalalu: హిందూ సాంప్రదాయ ప్రకారం గణేష్‌ చతుర్థికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ దేవుడిని అన్ని దేవతలకు అధిపగా వ్యవహరిస్తారు. అందుకే ఈ ప్రతి పూజలో గణేషుడిని పూజించిన తర్వాత ఇతర దేవతలకు పూజిస్తారు. గణేష్‌ చతుర్థి పండగ రోజున విఘ్నేశ్వరుడిని మనస్పూర్తిగా పూజించడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని హిందువుల నమ్మకం.. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని చతుర్థి తిథి నుంచి వినాయక చవితి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పండగ 7 సెప్టెంబర్ వచ్చింది. ఈ పండగను 17 సెప్టెంబర్ 2024న వరకు హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణేషుడు భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి జన్మించారు. అయితే ఈ తిథిల్లో జన్మించిన వారికి బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే గణేష్ చతుర్థి సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి అంగారకుడు పాలిస్తారు. కాబట్టి వీరికి ధైర్యం విపరీతంగా ఉంటుంది. దీంతో పాటు వీరు అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు తెలవితేటలను వినియోగించి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా వినాయకుడి అనుగ్రహంతో ఎలాంటి పనుల్లోనైనా విజయాలు కలుగుతాయి. 

మిథునరాశి:
మిథునరాశి వారికి కూడా వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వీరు చవితి రోజు గణేషుడిని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఊహించని సమస్యల నుంచి కూడా సులభంగా బయట పడతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పూర్తిగా ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశివారిని చంద్రుడు పరిపాలిస్తారు. దీని కారణంగా వీరికి ఎల్లప్పుడు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో సానుకూల ప్రభావాలు ప్రారంభమవుతుంది. దీంతో పాటు వీరికి తెలివి తేటలు కూడా పెరుగుతాయి. అలాగే అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

మకర రాశి:
గణేశుడి అనుగ్రహం లభించడం వల్ల మకర రాశి వారు కూడా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఎలాంటి కష్టాలు ఉన్న తొలగిపోతాయి. అంతేకాకుండా వీరు ప్రతి పనిలో విజయాన్ని సాధించే శక్తిని పొందుతారు. అంతేకాకుండా వ్యాపార, విద్యా రంగాలలో వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News