Vinayaka Mandapam Challan : యూటర్న్ తీసుకున్న హోంమంత్రి.. వినాయక మండపాల చలాన్‎ల విషయంలో కీలక వ్యాఖ్యలు

vangalapudi anitha on vinayaka mandapam challans: ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలపై ఎలాంటి చలాన్లు విధించడం లేదని, 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను చదివి మాత్రమే వినిపించామని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రతిపక్షాల కుట్రని రాష్ట్ర హోం మంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు.

Written by - Bhoomi | Last Updated : Sep 8, 2024, 09:33 PM IST
Vinayaka Mandapam Challan : యూటర్న్ తీసుకున్న హోంమంత్రి.. వినాయక మండపాల చలాన్‎ల విషయంలో కీలక వ్యాఖ్యలు

Vangalapudi Anitha on Vinayaka Mandapam Challans: ఏపీలో వినాయక మండపాలపై చలాన్లు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై హోం మంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం వినాయక మండపాలకు సంబంధించి ఎలాంటి చలాన్లను విధించడం లేదని ఆవిడ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లగా ఆయన వినాయక మండపాల నుంచి ఒక రూపాయి కూడా వసూలు చేయకూడదని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష వైసిపి పార్టీ ఇదే అదనుగా తీసుకొని విష ప్రచారాన్ని ప్రారంభించిందని దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆమె దుయ్యబట్టారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో 2022లో గత ప్రభుత్వం వినాయక మండపాలపై జారీ చేసిన జీవోను మాత్రమే చదివి వినిపించామని ఆ జీవోను అమలు చేస్తామని ఎక్కడా తెలపలేదని ఆమె పేర్కొన్నారు. 

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేవలం సింగిల్ విండో విధానం ద్వారానే గణేష్ మండపాలకు అనుమతి ఇస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గత ప్రభుత్వ జీవోలోని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఆయన ఈ జీవోను ఎట్టి పరిస్థితులను అమలు చేయవద్దని వినాయక మండపాల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించామని తెలిపారు .అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు ఎక్కడా కూడా డబ్బులు వసూలు చేయలేదని మైక్ పెర్మిషన్ కు కూడా డబ్బులు వసూలు చేయడం లేదని.. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అయితే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కించపరిచేలా కుట్ర జరిగిందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

Also Read: Business Ideas: మహిళలకు లక్కీ ఛాన్స్ ..ఇల్లు కదలకుండా రోజుకు 5000 రూపాయలు సంపాదించే  బిజినెస్ ఐడియా  

ఓ వైపు ప్రజలంతా వరద బాధితులుగా కష్టాల్లో ఉంటే ప్రతిపక్ష పార్టీ మాత్రం దుష్ప్రచారాలకు తెరలేపిందని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. అంతేకాదు ప్రకాశం బ్యారేజీ గేట్లను దురుద్దేశం పూర్వకంగానే బోట్లతో ఢీకొట్టారని తద్వారా భారీ ప్రమాదం జరిగేలా కుట్ర జరిగిందని ఈ దిశగా విచారణ జరుగుతోందని హోం మంత్రి అనిత తెలిపారు. ప్రకాశం బ్యారేజీ టార్గెట్ గా వచ్చి ఢీకొన్న మూడు పడవలు వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానాలు బలపడుతున్నాయని దీనిపైన సమగ్ర విచారణ జరుగుతుందని త్వరలోనే నిందితులను బయటపెడతామని ఆమె తెలిపారు. 

ఇదిలా ఉంటే ప్రముఖ సినీ నటి మాధవి లత సోషల్ మీడియా వేదికగా హోం మంత్రి అనితను విమర్శిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.  ఇందులో వినాయక మండపాలపై ఏపీ ప్రభుత్వం చలాన్లు వసూలు చేయడం అన్యాయం అని పేర్కొన్నారు.

Also Read: Hero Splendor Plus Xtech: పిచ్చెక్కించే ఫీచర్లతో హీరో స్ల్పెండర్ బైక్..ధర, స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందే  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News