Hebah Patel: హెబ్బా పటేల్ మూవీకి రికార్డుస్థాయిలో వ్యూస్.. దూసుకుపోతున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్

Honeymoon Express Streaming On Amazon Prime: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీకి అమెజాన్ ప్రైమ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 15, 2024, 10:25 PM IST
Hebah Patel: హెబ్బా పటేల్ మూవీకి రికార్డుస్థాయిలో వ్యూస్.. దూసుకుపోతున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్

Honeymoon Express Streaming On Amazon Prime: సినిమాలో మంచి కంటెంట్ ఉంటే థియేటర్ అయినా.. ఓటీటీ అయినా ప్రేక్షకుల నుంచి మచి ఆదరణ దక్కుతోంది. కొన్నిసార్లు థియేటర్‌లో మిస్ అయిన సినిమాలకు ఓటీటీలో భారీ క్రేజ్ వస్తుంటుంది. ఇలాంటి చిత్రాల జాబితాలోనే హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ సినిమా కూడా చేరింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఆగస్టు 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం.. రికార్డుస్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది.

Also Read: CM Revanth Reddy: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాం.. సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..   

రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. కేకేఆర్, బాల రాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రేమ, పెళ్లి, విడాకులపై వచ్చిన ఈ చిత్రం జూన్ 21న థియేటర్‌లలో సందడి చేసింది. చైతన్య, హెబ్బా పటల్ యాక్టింగ్‌కు ఆడియన్స్‌ మంచి మార్కులే వేశారు. సెటైరికల్‌గా సాగిపోయే కథలో కొన్ని ట్విస్టులు, సస్పెన్స్ థ్రిల్‌కు గురిచేస్తాయి. ఇక ఈ సినిమాకు కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. థియేటర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం.. అమెజాన్‌లో కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించింది. మున్ముందు మరింత ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు. 

కథ ఏంటి..?

ప్రస్తుతం చాలామంది యువత ప్రేమ పెళ్లి చేసుకోవడం.. చిన్న గొడవలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం చూస్తునే ఉన్నాం. ఈ కాన్సెప్ట్‌నే తీసుకుని డైరెక్టర్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ను రూపొందించారు. స్టోరీలో సోనాలి (హెబ్బా పటేల్), ఇషాన్ (చైతన్యరావు) ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కాపురంలో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. అయితే వీరిద్దరికి బాల (తనికెళ్ల భరణి), త్రిపుర సుందరి (సుహాసిని) జంట ఓ సలహా ఇస్తుంది. ఈషాన్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే రిసార్ట్‌లోకి వెళ్లిన తరువాత వీళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి..? వారిద్దరు విడాకుల నిర్ణయాన్ని మార్చుకున్నారా..? అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని తప్పకుండా ఓటీటీలో చూసేయండి. 

Also Read: Harish rao: సీఎం నోటి కంపు మోరీల్ని మించిపోయింది.. మరోసారి పంచ్ లు వేసిన హరీష్ రావు .. వీడియో..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News