Jr NTR: ఎన్టీఆర్ మూవీ చూపిస్తూ అభిమానికి బ్రెయిన్ సర్జరీ.. దీనికి సహాయపడిన అవేక్ క్రానియోటమీ అంటే ఏంటి?

NTR Fan: అనంతలక్ష్మి అని 55 సంవత్సరాల మహిళకు బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చేస్తూ ఆమెకు చికిత్స చేశారు  ఆమెకు చికిత్స చేసినప్పుడు అవేక్ క్రానియోటమీ అనే పద్ధతిని ఉపయోగించి చికిత్స చేశారు. దీంతో ఈ పద్ధతి అంటే ఏంటి అంటూ వైరల్ అవ్వగా.. మెదడు మేల్కొని ఉన్నప్పుడు చేసే ప్రక్రియనే  అవేక్ క్రానియోటమీ అని పిలుస్తారట.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 19, 2024, 07:02 PM IST
Jr NTR: ఎన్టీఆర్ మూవీ చూపిస్తూ అభిమానికి బ్రెయిన్ సర్జరీ.. దీనికి సహాయపడిన అవేక్ క్రానియోటమీ అంటే ఏంటి?

Jr NTR Fan: ఆంధ్రప్రదేశ్లో ఒక అభిమాని లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కి. వైద్యులు అదుర్స్ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్,  బ్రహ్మానందం కామెడీ చూపిస్తూ.. సర్జరీ చేయడం వైరల్ గా మారింది. అవేక్ క్రానియోటమీ అనే ప్రత్యేకమైన వైద్య ప్రక్రియ ద్వారా బ్రెయిన్ సర్జరీ చేశారు. అయితే అవేక్ క్రానియోటమీ అంటే ఏంటి?  అనే విషయం వైరల్ గా మారింది.

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళలకు కఠినమైన మెదడు శస్త్ర చికిత్స.. చేశారు. అయితే ఆమెకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు.. వైద్య నిపుణులు ఆమెను జూనియర్ ఎన్టీఆర్ చిత్రం అదుర్స్ చిత్రాన్ని టాబ్లెట్ లో చూపిస్తూ శస్త్ర చికిత్స.. చేశారు. ఆమె మెలుకువలో ఉంటూ.. సినిమా చూస్తుండగా..  ఫల ఆమెకు  రెండున్నర గంటల పాటూ.. శ్రమించి, కఠినమైన బ్రెయిన్ సర్జరీ సాఫీగా చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ విశిష్టమైన విధానాన్ని అవేక్ క్రానియోటమీ అని పిలుస్తారట. ఇది రోగి స్పృహలో ఉన్నప్పుడు చేసే శాస్త్ర చికిత్స. వైద్య పరిభాషలో చెప్పాలంటే మెదడు మేల్కొని ఉన్నప్పుడు చేసే శస్త్ర చికిత్స నే అవేక్ క్రానియోటమీ అని పిలుస్తారట. 

అవేక్ క్రానియోటమీ అంటే రోగి మెలుకువగా ఉన్నప్పుడు మాత్రమే మెదడుకు చేసే శస్త్ర చికిత్స ఇది. వాస్తవానికి మూర్చ చికిత్సకు ఉపయోగించబడినప్పటికీ మెదడు లో ఏర్పడిన కణితిలను.. తొలగించడానికి తరచుగా ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. ముఖ్యంగా మెదడు శస్త్ర చికిత్స చేసే సమయంలో రోగి పూర్తిగా మేల్కొనే ఉంటారు. శస్త్ర చికిత్స బృందంతో కూడా రోగి మాట్లాడవచ్చు. ఇది క్లిష్టమైన విధులను నియంత్రించే మెదడులోని హానికరమైన ప్రాంతాలను నివారించడానికి సర్జన్ ను  ఇది బాగా ఉపయోగపడుతుంది. 

అవేక్ క్రానియోటమీ అనే ప్రక్రియ.. ఏదైనా ముఖ్యమైన కదలికకు ముందు మెదడును పరీక్షించడానికి అలాగే శస్త్ర చికిత్స సమయంలో రోగి యొక్క పనితీరును పర్యవేక్షించడానికి సర్జన్ కు  అనుకూలంగా మారుతుంది. అందుకే వైద్యులు ఈ పద్ధతిని ఉపయోగిస్తారట. 

రోగి అనంతలక్ష్మి విషయానికి వస్తే.. కొత్తపల్లి నివాసి అయిన ఈమె తన అవయవాల తిమ్మిరి, నిరంతర తలనొప్పితో బాధపడేదట. దీంతో వైద్యులను సంప్రదించినప్పుడు ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించారు. మహిళ మెదడు యొక్క ఎడమవైపున 3.3 x 2.7 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు నిర్ధారించారు.  ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ఖర్చులు ఎక్కువ కావడంతో ఆమె ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు ఈ పద్ధతిని ఉపయోగించి, కణితిని విజయవంతంగా తొలగించారు.

Also Read: Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..

Also Read: Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News