AP Heavy Rains: ఇవాళ అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో 3-4 రోజులు భారీ వర్షాలు

AP Weather Updates in Telugu: ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చమ మద్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడనుందని ఫలితంగా రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2024, 09:22 AM IST
AP Heavy Rains: ఇవాళ అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో 3-4 రోజులు భారీ వర్షాలు

AP Weather Updates in Telugu: బంగాళాఖాతంలో ఇప్పటికే రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు ఆవర్తనాల కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న 3-4 రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయి.

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. అందుకే బహిరంగ ప్రదేశాలు, పొలాలు, చెట్ల కింద ఉండవద్దని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడవచ్చు. 

ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఇక కాకినాడ, తూర్పు గోదావరి, అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ప్రస్తుతానికి లేవని తెలుస్తోంది. తీర ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 

Also read: Heavy Rains in Telugu States: తెలంగాణ, ఏపీలో 3 రోజులు కుండపోత వానలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News