Fatty Liver Remedy: ఫ్యాటీ లివర్ వ్యాధి ఎన్ని రకాలు, లివర్‌లో కొవ్వును తొలగించే అద్భుత చిట్కాలు

Fatty Liver Remedy: మనిషి శరీరంలో అతి ముఖ్యమైం అంగం లివర్. ఇటీవలి కాలంలో లివర్ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇందులో ఒకటి ఫ్యాటీ లివర్. ఎంత తేలిగ్గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించాలంటే ఏం చేయాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2024, 07:57 PM IST
Fatty Liver Remedy: ఫ్యాటీ లివర్ వ్యాధి ఎన్ని రకాలు, లివర్‌లో కొవ్వును తొలగించే అద్భుత చిట్కాలు

Fatty Liver Remedy: చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అనేది ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రధాన కారణం. తినే ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంటుంది. దీనినే ఫ్యాటీ లివర్ లేదా హెపాటిక్ స్టీటోసిస్ అంటారు. ఫ్యాటీ లివర్ సమస్య అందరికంటే ఎక్కువగా డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారిలో కన్పిస్తోంది. ఫ్యాటీ లివర్ సమస్యను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవద్దనే వైద్యులు సూచిస్తుంటారు

ఫ్యాటీ లివర్ అనేది తీవ్రతను బట్టి మారుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 రకాలుగా ఉంటుంది. లివర్‌లో ఫ్యాట్ పేరుకున్నప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వ్యాధిగా పరిగణించాలి. ఇందులో లివర్ 5-33 శాతం వరకూ ఫ్యాట్ పేరుకుంటుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 స్థితిలో ఉంటే పెద్దగా లక్షణాలు బయటపడవు. అందుకే ఈ పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి. లక్షణాలు కన్పించకపోవడంతో సాధారణంగా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇది కాస్తా గ్రేడ్ 2కు దారి తీయవచ్చు. కొన్ని చిట్కాలు, హోమ్ రెమిడీస్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఫ్యాటీ లివర్ అరికట్టేందుకు ఆయుర్వేద పద్ధతులున్నాయి. 

గిలోయ్ ఆకుల జ్యూస్ అనేది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. ఇది లివర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. లివర్ సంబంధిత వ్యాధుల్నించి రక్షించేందుకు గిలోయ్ ఆకుల జ్యూస్ కీలకంగా పనిచేస్తుంది. రోజూ సగం స్పూన్ గిలోయ్ పౌడర్ వేడి నీటిలో కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితాలుంటాయి. 

ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించేందుకు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండే వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది.  ఇందులో ఉండే ఎలిసిన్, సెలేనియం కారణంగా లివర్ శుభ్రంగా ఉంటుంది. ఎంజైమ్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీనికోసం ప్రతి రోజూ ఉదయం పరగడుపున 1-2 వెల్లుల్లి రెమ్మల్ని తింటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. లివర్ పేరుకున్న కొవ్వును తొలగించేందుకు పసుపును తగిన మోతాదులో సేవించాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు లివర్ సమస్యను అద్భుతంగా తగ్గిస్తాయి. రోజూ గోరు వెచ్చని నీటిలో కొద్గిగా పసుపు కలిపి తాగాలి. 

ఆల్కహాల్ అలవాటు లేకపోయినా ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ పరిస్థితిలో త్రిఫలం పౌడర్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో లభించే మూడు అద్భుతమైన ఫలాలతో తయారు చేస్తారు. దీనివల్ల లివర్ పూర్తిగా డీటాక్స్ అవుతుంది. రోజూ గోరువెచ్చని నీటిలో కొద్దిగా త్రిఫలం పౌడర్ కలుపుకుని తాగాలి. 

Also read: White Hair Problem: జుట్టు ఎందుకు తెల్లబడుతుంది, మీ డైట్‌లో ఈ విటమిన్ ఉంటే వైట్ హెయిర్ సమస్యకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News