Gold Rate Today: పండగవేళ పసిడి ప్రియులకు ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..తులంపై ఏకంగా

Gold Price Silver Price Today: పసిడి ప్రియులకు ఇది ఊరటనిచ్చే వార్త. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పండగల ముందు బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం  చేస్తున్నారు. నేడు దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Oct 1, 2024, 08:15 AM IST
Gold Rate Today: పండగవేళ పసిడి ప్రియులకు ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..తులంపై ఏకంగా

Gold Price Silver Price Today: అక్టోబర్ 1, మంగళవారం బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 400 రూపాయలు తగ్గింది. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,500 నమోదు కాగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 70,800 రూపాయలుగా నమోదు అయ్యింది.

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తోంది. సిరియాలో అమెరికా వైమానిక దాడులు చేసిన అనంతరం బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు దీంతో తమ పెట్టుబడులను బంగారం వైపు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 

దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వు గత నెలలో వడ్డీ రేట్లు తగ్గించడంతో ముందుగా మనందరం ఊహించినట్లుగానే బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. ఈ విషయంపై గడచిన నెల రోజులుగా బంగారం ధర పెరుగుతుందని మనం ముందుగానే చెబుతూ వస్తున్నాము. ప్రస్తుతం మన అంచనాలకు తగ్గట్టుగానే బంగారం ధర పెరుగుతోంది. అయితే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా అటు దసరా, దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా పసిడి ఆభరణాల మార్కెటింగ్ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. 

దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. బంగారు ఆభరణాలను ఎక్కువగా ధన త్రయోదశి రోజు కొనుగోలు చేస్తారు. అయితే ధన త్రయోదశి ఈనెల చివరిలో వచ్చింది. దీంతో పసిడి ధరలు ఈ నెల చివరి నాటికి కనీసం 85 వేల రూపాయల నుంచి 90000 వరకు తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజమైనట్లయితే బంగారం ధర ఇక సామాన్యుడికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Also Read:  Success Story:  ఓ బ్యాచిలర్ గదిలో పుట్టిన ఐడియా.. 35వేల కోట్లు సామ్రాజ్యానికి పునాది.. బెజవాడ బ్యాచిలర్ సక్సెస్ స్టోరీ ఇదే  

అయితే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ నేపథ్యంలోఈ ధరలు మళ్లీ దిగి వస్తాయా లేదా అనే సందేహం మీకు కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా బంగారం పైనే నెలకొని ఉంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫ్గా భావించే బంగారం పైన పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. 

ఈ నేపథ్యంలో బంగారం ధరలు, ఏ రోజుకు ఆ రోజు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. చైనా లాంటి దేశాలు సైతం బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి. రాబోయే ఆర్థికమాంద్యాన్ని ముందుగానే ఊహించి వర్తమాన దేశాలు సైతం బంగారం పైనే పడ్డాయి. వీటి నేపథ్యంలో బంగారం ధర ప్రస్తుతం ఉన్న ధర నుంచి తగ్గే అవకాశం పెద్దగా కనిపించడం లేదు.

Also Read: ​ IDFC Limited: అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఐడీఎఫ్‎సీ, ఐడీఎఫ్‎సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. ఖాతాదారులు,షేర్ హోల్డర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News