CM Revanth Reddy: సీఎం కావాలనే లక్ష్యం పెట్టుకుని సాధించా.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Chief Ministers Cup 2024: లక్ష్యం పెట్టుకుని కష్టపడి చేస్తే.. సాధించలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎం కావాలనే లక్ష్యంతో పనిచేసి అనుకున్నది సాధించానని చెప్పారు. క్రీడాకారుకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 3, 2024, 06:55 PM IST
CM Revanth Reddy: సీఎం కావాలనే లక్ష్యం పెట్టుకుని సాధించా.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Chief Ministers Cup 2024: తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్ క్రీడలకు తలమానికంగా నిలబడిందన్నారు. తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారని అన్నారని.. ఇది బాధ కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామన్నారు. 

Also Read: Pawan Kalyan Fever: పవన్ కు తీవ్ర జ్వరం.. వారాహీ సభపై ఉత్కంఠ..  

"నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియాకు బాక్సింగ్‌లో తలమానికంగా మారారు. నిఖత్ జరీన్‌కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చాం.. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం.. నిబంధనలు సడలించి మహ్మద్ సిరాజ్‌కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చాం.. పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు.. పుట్‌బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం.. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్ 17 పుట్‌బాల్ నేషనల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకుంటోంది..

చిన్న దేశం దక్షిణ కొరియాలో ఒలంపిక్స్‌లో 36 పతకాలు సాధించింది.. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం.. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం.. దక్షిణ కొరియా కోచ్‌లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం.. మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే.. దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే.. ఎల్బీ స్టేడియాన్ని అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతాం.. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు.. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే అవకాశం ఉంటుంది.. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరుపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి.. రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది..

2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేను అత్యంత పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా విజయం సాధించినా.. 2018న ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేను 2023న తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాను.. తెలంగాణకు సీఎం కావాలని నేను లక్ష్యం పెట్టుకున్నా.. సాధించాను.. లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది లేదు.. క్రీడాకారులకు పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది.." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News