Konda Surekha : మంత్రి కొండా సురేఖ చుట్టూ అలుముకుంటున్న వివాదాలు

Konda Surekha : తెలంగాణలో ఆ మహిళా మంత్రికి ఏమైంది....?తరుచూ ఆ మంత్రి ఎందుకు వివాదాలకు కేంద్రంగా మారుతుంది...? వివాదాల దగ్గరు ఆమె వెళుతుందా....?లేక వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయా..? ఆ మంత్రి వైఖరితో సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారా..? కీలక సమయంలో ఆ మంత్రి చేసిన కామెంట్స్ ఏకంగా కాంగ్రెస్ పార్టీనే డిఫెన్స్ పడేలా చేశాయా....? ఇంతకీ ఎవరా మంత్రి ..? ఏంటా కథ..?   

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 15, 2024, 07:59 PM IST
Konda Surekha : మంత్రి కొండా సురేఖ చుట్టూ అలుముకుంటున్న వివాదాలు

Konda Surekha : తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రి కొండా సురేఖ పేరే వినిపిస్తుంది.ఈ మధ్య మంత్రి సురేఖను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి వస్తున్న వివాదాలతో మంత్రి డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల మంత్రి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే చెలరేగింది. వాస్తవానికి మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి కామెంట్స్ చేసినా దాని పర్యావసనం మాత్రం ఇటు రాజకీయాల్లో, ఆటు సినీ పరిశ్రమలో పెద్ద అలజడినే రేపింది. మంత్రి సురేఖ తన వ్యాఖ్యల్లో కేటీఆర్, నటి సమంతి, అక్కినేని నాగార్జున ప్రస్తావన తేవడమే ఈ దుమారానికి కారణమైంది.

 అంతకు ముందు మంత్రి కొండా సురేఖను సోషల్ మీడియాలో కొందరు అసభ్యకరంగా ట్రోల్ చేశారు.దీంతో మంత్రి తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీని వెనుక ఉన్నది బీఆర్ఎస్ నేతలే అని కొండా సురేఖ అనుమానం. దీంతో ఏకంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా నటి సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ బాంబు పేల్చింది. దీంతో ఇటు బీఆర్ఎస్ అటు నటి సమంత, నాగార్జున సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మంత్రి వ్యాఖ్యలను అందరూ తప్పుబట్టారు. సొంత పార్టీ నుంచి కూడా మంత్రికి ఈ విషయంలో మద్దతు కరువైంది. 

మంత్రి సురేఖ వ్యాఖ్యల అంశం ఢిల్లీ స్థాయికి వెళ్లింది. ఏకంగా అధిష్టానం జోక్యం చేసుకొని మంత్రితో క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ ఇష్యూ కాస్తా సెటిల్ అయ్యింది. కానీ ఇంకా దాని ప్రకంపనలు అప్పుడప్పుడు కొనసాగుతన్నాయి. ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలపై ఇటు కేటీఆర్, అటు నాగార్జున కూడా కోర్టును ఆశ్రయించారు.అంతే కాదు సురేఖ కామెంట్స్ తో టాలీవుడ్ లో కూడా పెద్ద అలజడి రేగింది. దీంతో ఒక్కసారిగా మంత్రి కొండా సురేఖ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఇటు రాజకీయంగా అటు సినీ పరిశ్రమ నుంచి మంత్రిపై తీవ్ర ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని ప్రకటించారు. 

ఇది ఇలా ఉండగానే వరంగల్ జిల్లాలో కొండా సురేఖకు కొందరి నేతలతో రాజకీయంగా తీవ్ర విభేధాలు ఉన్నాయి. అందులోను సొంత పార్టీ నేతలల్లో కొందరితో కూడా మంత్రికి పెద్దగా పొసగదు అనే ప్రచారం ఉంది. ఇటీవల పరకాల నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి సురేఖ అనచరులకు మధ్య రాజకీయ వైరం నడుస్తుంది. అది తారాస్థాయికి చేరి ఘర్షణలకు దారి తీసింది. ఈ గొడవలో సురేఖ, రేవూరి అనచరులకు గాయాలయ్యాయి. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మంత్రి సురేఖ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఏకంగా గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సీఐ సీటులో కూర్చొని మరి పోలీసులకు హుకుం జారీ చేయడం పెద్ద సంచలనంగా మారింది. దీంతో మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక తాజాగా సికింద్రాబాద్ లోని ఓ ఆలయంలో కొందరు దుండగులు చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది హైదరాబాద్ అంతా తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. ఉదయం నుంచి రాత్రి వరకు సికింద్రాబాద్ లో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.అయితూ దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖ మాత్రం దీనిపై కనీసం స్పందించలేదనే విమర్శలు వినపడ్డాయి. ప్రతి చిన్న దానికి స్పందించే మంత్రి ఇంత పెద్ద విషయంలో కనీసం మాట కూడా మాట్లాడకపోవడం ఏంటని హిందూ సంఘాలు సీరియస్ అయ్యాయి. దీంతో మంత్రి కొండా సురేఖ తీరు చాలా వివాదాస్పదం అవుతుందని మీడియా సర్కిల్ లో తెగ చర్చ నడుస్తోంది.

సహజంగానే మంత్రి కొండా సురేఖ కు ఫైర్ బ్రాండ్ గా ముద్ర ఉంది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా సురేఖను బాగా ఎంకరేజ్ చేశారు. అటు తర్వాత కొండా సురేఖ వైఎస్ తనయుడు జగన్ తో రాజకీయంగా అడుగులు వేసింది. ఆ సందర్భంలో జరిగిన ఘటన కూడా తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. తెలంగాణ ఉద్యమం ఇప్పటికీ మానుకోట ఘటనను మరవదు.అలాంటి మానుకోట ఘటనలో మంత్రి కొండా సురేఖది ప్రధాన పాత్ర.అలాంటి సురేఖ కాలక్రమంలో తెలంగాణ ఏర్పడడంతో టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. టీఆర్ఎస్ లో రాజకీయంగా ఫ్రీడమ్ లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరింది.ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో మంత్రిగా అవకాశం పొందింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో సీనియర్ మంత్రిగా కొండా సురేఖ కొనసాగుతున్నారు . అలాంటి సురేఖ తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందది.

కొండా సురేఖ వరుస వివాదాలలో ఇరుక్కుంటుండంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. కేటీఆర్, సమంత ఎపిసోడ్ లో చేసిన కామెంట్స్ తో  మంత్రి పదవి ఊస్టింగ్ పక్కా అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొండా సురేఖ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యడాని సమాచారం. ఆవేశ పూరిత కామెంట్స్ తో అనవసరంగా ప్రతిక్షాలకు అవకాశం ఇవ్వకూడదని సురేఖ కు చెప్పినట్లు సమాచారం.మరోవైపు పార్టీకీ, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఎవరూ ప్రవర్తించరాదని పిసిసి కూడా నేతలను హెచ్చరించినట్లు తెలిసింది.

Read more: Mutyalamma Temple: ముత్యాలమ్మ విగ్రహాం ధ్వంసం.. రంగంలోకి దిగిన రాజాసింగ్.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News