Jamili Elections: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి అప్పగించినప్పట్నించి ఎప్పుడు జమిలి ఎన్నికలుంటాయా అనే చర్చ నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా జమిలి ఎన్నికలు నిర్వహించే దిశగానే అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికల్లో భాగంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సిద్ధమౌతోంది.
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలో అధ్యయనం చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలో మొత్తం 5 ఆర్టికల్స్ సవరించాలని తెలిపింది. ఇందులో భాగంగా ఆర్టికల్ 83, 85, 172, 174, 356 సవరించాల్సి ఉంది. ఈ బిల్లులు పార్లమెంట్ ఉభయసభల్లో మూడోవంతు అంటే 67 శాతం మద్దతు ఇవ్వాలి. దాంతోపాటు కనీసం 14 రాష్ట్రాలు ఓకే అనాలి. అప్పుడే ఈ బిల్లు ఆమోదం పొంది జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుంటుంది. ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టవచ్చు. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం లభిస్తే 2027 యూపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆ తరువాత కొద్దిరోజుల వ్యవధిలో మున్సిపల్, కార్పొరేషన్, గ్రామ పంచాయితీ ఎన్నికలు జరపవచ్చు.
ఇప్పటికే జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సహా పలువురు స్పందించారు. త్వరలోనే జమిలి ఎన్నికలుంటాయని సంకేతాలిచ్చారు. అయితే ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా, జమ్ము కశ్మీర్ సహా ఇతర రాష్ట్రాలు 2-3 ఏళ్లు ముందుగానే అసెంబ్లీ రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్ సైతం జమిలి ఎన్నికలకు అంగీకరించడంతో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Also read: ED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.