YCP MLC: తిరమలలో వైసీపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు.. వెంకన్న దర్శనానికి డబ్బులు వసూళు చేశారంటూ..

YCP MLC: 2024లో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కో దుర్మార్గమైన పనులు బయట పడుతున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ తిరుమల దర్శనానికి ఏకంగా కొంత మంది భక్తుల నుంచి రూ. 65 వేలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 21, 2024, 06:08 AM IST
YCP MLC: తిరమలలో వైసీపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు.. వెంకన్న దర్శనానికి డబ్బులు వసూళు చేశారంటూ..

YCP MLC: తిరుమలలో గత ప్రభుత్వం హయాములో జరిగిన కొన్ని అపచరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే తిరుమల లడ్డూలో  కల్తీ నెయ్యి వ్యవహారం జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానంపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనం కోసం డబ్బులు వసూలు చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు జకియాపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని ఆరుగురి నుంచి రూ. 65 వేలు వసూలు చేసినట్టు ఆరోపించారు.

టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్సీ తమ చేతిలో సిఫార్సు లేఖ పెట్టారని పేర్కొన్నారు. భక్తుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియాఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

దీనిపై తదుపరి దర్యాప్తు చేసి ఆరోపణలు నిర్ధారణ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ జకియాఖానంతో వైసీపీకి సంబంధం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. కావాలనే కూటమి ప్రభుత్వం తమపై తిరుమల విషయమై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఏది ఏమైనా తిరుమల దర్శనానికి సంబంధించిన కేవలం వైసీపీ నాయకులే కాదు.. తెలుగు దేశం పార్టీ, ఇతర పార్టీలు నాయకులు కూడా సిఫార్సులు లేఖలు అమ్ముకున్నారనే విషయాన్ని పలువురు నెటిజన్స్ సోషల మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఘటనలు జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News