Jithender Reddy: తెలుగు తెరపై మరో రియలిస్టిక్ బయోపిక్ ‘జితేందర్ రెడ్డి’.. నవంబర్ 8న విడుదల..

Jithender Reddy: తెలుగు తెరపై ఇప్పటి వరకు కమ్యూనిజం, నక్సలిజం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ప్రతి ఇజంలో ఓ చీకటి కోణం ఉంటుంది. తాజాగా నక్సలిజంలోని చీకటి కోణాన్ని 1980లలో  చీల్చి చెండాడిన ఓ వ్యక్తి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 22, 2024, 05:25 AM IST
Jithender Reddy: తెలుగు తెరపై మరో రియలిస్టిక్ బయోపిక్ ‘జితేందర్ రెడ్డి’.. నవంబర్ 8న విడుదల..

Jithender Reddy: రాకేష్ వర్రే టైటిల్ రోల్ లో యాక్ట్ చేసిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ డైరెక్ట్ చేసారు. ఎపుడూ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ‘జితేందర్ రెడ్డి’ సినిమా తెరకెక్కింది.  ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.

జితేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకులను  విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ కి  మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా, సినిమా టీజర్, గ్లిమ్ప్స్, రెండు పాటలు ఆడియన్స్  మనసు దోచుకున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కడం చెప్పుకోదగ్గ అంశము.  

తెలుగు తెరపై  నక్సలిజం, పోలీస్, మిలటరీ ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా అని చెప్పాలి. ఇక పోలీస్ వాళ్లలో  మంచి, చెడు  ఉన్నట్టే.. నక్సలిజంలో కూడా కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ అంశాలున్నాయి. ఒకపుడు తాడిత, పీడిత వర్గాల కోసం గన్ చేతబట్టిన అడవుల బాట బట్టిన అన్నలకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఇదంత నాణేనికి ఒకవైపు మాత్రమే. వాళ్లలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. బిజినెస్ మ్యాన్, ఇతర వర్గాల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడే వసూల్ రాజాలు కూడా నక్సలైట్స్‌లలో ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో నక్సలైట్స్ చేస్తోన్న ఆరాచకాలపై  1980లలో తిరుగు బాటు చేసిన జగిత్యాల చెందిన జితేందర్ రెడ్డి లైఫ్ ను సిల్వర్ స్క్క్రీన్  పై  ఆవిష్కరించాడు దర్శకుడు విరంచి వర్మ.

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ.. ప్రజలను అభివృద్దికి దూరం చేస్తోన్న నక్సలైట్ల పై  జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను పాలిటిక్స్ లో  రావడం.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ తో  మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. ఇప్పటికే భారీ అంచనాలని మూటగట్టుకున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News