KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగి

KT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్‌ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 25, 2024, 05:25 PM IST
KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగి

KTR Emotional: విద్యుత్‌ ఛార్జీలు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో ఈఆర్సీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన కేటీఆర్‌ మార్గమధ్యలో ఓ రోడ్డు ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపివేశారు. వెంటనే కిందకు దిగి సహాయ చర్యలు చేపట్టారు. కేటీఆర్‌ చూపిన మానవత్వం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Also Read: Konda Surekha Vs KTR: కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖపై కోర్టు షాకింగ్ కామెంట్స్.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం

తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు శుక్రవారం వస్తుండగా మార్గమధ్యలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు విలవిలలాడుతున్నారు. వెంటనే అది చూసి కేటీఆర్‌ చలించిపోయారు. వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కిందపడి గాయాలతో చెట్టు కింద విలవిలలాడుతున్న వ్యక్తిని చూసి కేటీఆర్‌ చూడలేకపోయారు. వెంటనే చూపు తిప్పుకుని వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆగమేఘాల మీద రప్పించారు. అనంతరం స్థానిక పోలీసులకు ప్రమాద విషయం సమాచారం అందించారు. బాధితులను ఆస్పత్రికి తరలించే వరకు కేటీఆర్‌ ప్రయత్నాలు చేశారు.

Also Read: Singareni: సింగరేణి ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.93,750 దీపావళి బోనస్‌

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆగ్రహం
అంతకుముందు సిరిసిల్లలో నిర్వహించిన ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ఎమ్మెల్యేగా, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ గట్టిగా వాదనాలు వినిపించారు. అసలు ఛార్జీలు పెంచవద్దని కోరారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రతి మనిషికి విద్యుత్‌తో విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు సర్ణయుగంగా మారిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని చెప్పారు. విద్యుత్‌ కోతలకు తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేయడం దారుణంగా పేర్కొన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచితే సిరిసిల్ల చేనేత కళాకారులు కూడా ఇబ్బందులు పడతారని వివరించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News