ఐసిసి 4 రోజుల టెస్ట్ చాంపియన్‌షిప్‌ ప్రతిపాదనపై గంగూలీ స్పందన

నాలుగు రోజుల ఫార్మాట్‌లో టెస్ట్‌ మ్యాచ్‌లకు 2017 అక్టోబర్‌ 13న తొలిసారిగా ఐసీసీ ఆమోద ముద్ర వేయగా అదే ఏడాది డిసెంబర్ 26న మొదటిసారిగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య నాలుగు రోజుల టెస్ట్ జరిగింది. అయితే, రెండో రోజే మ్యాచ్‌ ముగియడం క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించకుండాపోలేదు.

Last Updated : Jan 1, 2020, 09:45 PM IST
ఐసిసి 4 రోజుల టెస్ట్ చాంపియన్‌షిప్‌ ప్రతిపాదనపై గంగూలీ స్పందన

న్యూఢిల్లీ: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (World Test Championship) ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లకు బదులుగా 2023 నుంచి వాటి స్థానంలో నాలుగు రోజులు టెస్ట్‌లను నిర్వహించాలని ఐసీసీ (ICC) చేసిన ప్రతిపాదనపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందించారు. ఐసిసి చేసిన ప్రతిపాదనలో ఏముందో చూడకముందే అప్పుడే కామెంట్ చేయడం సరికాదని.. ఐసిసి ప్రతిపాదన తమదాకా వస్తే, దాన్ని పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని గంగూలీ జవాబిచ్చారు. ఐసిసి చేసిన ప్రతిపాదనపై (four-day Tests) గంగూలీ నిర్ణయం ఇలా ఉండగా... ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రతిపాదనపై పలువురు క్రికెట్ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. 

నాలుగు రోజుల ఫార్మాట్‌లో టెస్ట్‌ మ్యాచ్‌లకు 2017 అక్టోబర్‌ 13న తొలిసారిగా ఐసీసీ ఆమోద ముద్ర వేయగా అదే ఏడాది డిసెంబర్ 26న మొదటిసారిగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య నాలుగు రోజుల టెస్ట్ జరిగింది. అయితే, రెండో రోజే మ్యాచ్‌ ముగియడం క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించకుండాపోలేదు. ఐసిసి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నవాళ్లు సరిగ్గా ఇలాంటివాటినే వేలెత్తి చూపిస్తున్నారు. అయితే, ప్రస్తుతం క్రికెట్ ప్రియులు కూడా టీ20 లాంటి షార్ట్ ఫార్మాట్స్‌పైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని.. అటువంటప్పుడు ఐదు రోజుల క్రికెట్‌ను నాలుగు రోజులకు కుదిస్తే వచ్చే నష్టమేముందనేది ఐసిసి ప్రతిపాదనను స్వాగతించే వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News