Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోంది

Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణమైతే..హఠాత్తుగా ఢిల్లీ పర్యటన మరో కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2024, 03:46 PM IST
Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోంది

Pawan Kalyan Delhi Tour in Telugu: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి. వాస్తవానికి ఇతని ప్రోద్భలంతోనే బీజేపీ కూటమిలో చేరిందనేది అందరికీ తెలిసిందే. మొన్నటి వరకూ మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా స్వరం మార్చారు. ఏకంగా హోంమంత్రినే టార్గెట్ చేశారు. ఇది దేనికి సంకేతమనే చర్చలు జరుగుతుండగానే ఢిల్లీ పర్యటన చేపట్టారు. 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల హోంమంత్రి అనిత, డీజీపీ, రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. హోంశాఖను తాను తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. అంతేకాకుండా తాను హోంమంత్రి అయితే యోగీలా వ్యవహరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. కూటమిలో ఉంటూనే హోంమంత్రి గురించి ఇలా వ్యాఖ్యానించడం దేనికి సంకేతమనే చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు తిరుపతి లడ్డూ విషయంలో సనాతన అవతారం ఎత్తి కావల్సినంత మైలేజ్ తీసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. ఇదంతా దేనికే సంకేతం, ఏం జరుగుతోందనే చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. 

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తిరుపతి లడ్డూ వ్యవహారం కాకుండా మరే విషయంలోనూ రాజకీయంగా వ్యాఖ్యానాలు చేయలేదు. కానీ హోంమంత్రి అనితను టార్గెట్ చేయడంతో పాటు అవసరమైతే హోంశాఖ తీసుకుంటాననడంతో అసలు ఏం జరుగుతోందనే చర్చ బయలుదేరింది. తాజాగా ఒంటరిగా ఢిల్లీకు బయలుదేరి వెళ్లడం, రాత్రికి హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానుండటం చర్చనీయాంశమౌతోంది. 

తెర వెనుక ఏం జరుగుతోంది

వాస్తవానికి పవన్ కళ్యాణ్‌కు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల బాధ్యత అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని సాక్షాత్తూ మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ వ్యవహారం భుజానకెత్తుకుని సనాతన అవతారం చేపట్టడం, తాజాగా హోంమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అంతా తెరవెనుక నుంచి జరుగుతున్న పరిణామాలకు నిదర్శనమని తెలుస్తోంది. 

Also read: EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News