"రుద్రమదేవి"కి నంది అవార్డు ఎందుకు ఇవ్వలేదు?

   

Last Updated : Nov 16, 2017, 04:31 PM IST
"రుద్రమదేవి"కి నంది అవార్డు ఎందుకు ఇవ్వలేదు?

"రుద్రమదేవి" చిత్రానికి నంది అవార్డు ఎందుకు ఇవ్వలేదని, ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. "ఈ అవార్డుల విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిని మూడేళ్ళ పాటు అనర్హులుగా ప్రకటిస్తామని అంటున్నారు? ఈ మాట విన్నాక నాకు ఒక్కటే అనిపించింది.. అసలు నేను స్వతంత్ర భారతదేశంలో ఉన్నానా? లేదా అని. నన్ను అనర్హుడిగా ప్రకటించినా ఫరవాలేదు.. కానీ నేను చెప్పాల్సిన నాలుగు మాటలూ చెబుతాను. మహిళా సాధికారతకు అద్దంపట్టే రుద్రమదేవి అసలు నంది అవార్డు ఎందుకు పొందలేకపోయింది? కనీసం జ్యూరీ అవార్డు కూడా ఈ సినిమాకి ఎందుకు రాలేదు? మర్చిపోయిన తెలుగు జాతి చరిత్రను ఎవరో సినిమా తీసి గుర్తు చేశారు.. వారికి అవార్డు ఇవ్వడం ఎందుకు అని కమిటీ ఎందుకు భావించింది? ఇలాంటి సినిమాని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కమిటీవారు ఎందుకు భావించారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు గుణశేఖర్. చివరిగా "రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి" అని కూడా తెలియజేశారు గుణశేఖర్. గుణశేఖర్ నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించిన రుద్రమదేవి చిత్రం త్రీడీలో 2015లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైంది. దాదాపు 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాపై మిశ్రమ స్పందనలు  వచ్చాయి. 

 

Trending News