/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

India vs South Africa Highlights: తెలంగాణ క్రికెటర్‌ తిలక్‌ వర్మ తొలి సెంచరీతో భారత్‌ రెండో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సులభమైన మ్యాచ్‌ను కఠినంగా చేసుకుని పోరాడి గెలిచింది. దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ ఏర్పడిన మ్యాచ్‌లో టీమిండియా గెలవడంతో ప్రేక్షకులకు ఊపిరి వచ్చింది. తర్వాతి నాలుగో మ్యాచ్‌కు భారత్‌ విజయోత్సాహంతో సిద్ధంగా ఉంది.

Also Read: Tilak Varma: సిక్సర్లతో చెలరేగిన తిలక్‌ వర్మ.. దక్షిణాఫ్రికాపై టీ20లో తొలి సెంచరీ
సెంచూరియన్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మూడో టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ డకౌట్‌ షాక్‌నివ్వగా.. అనంతరం అభిషేక్‌ శర్మ, తెలంగాణ ఆటగాడు తిలక్‌ వర్మ బ్యాట్‌తో చెలరేగిపోయారు. 25 బంతుల్లో అభిషేక్‌ అర్ధ శతకం చేయగా.. అతడి పార్ట్‌నర్‌షిప్‌తో తిలక్‌ వర్మ 56 బంతుల్లోనే 107 పరుగులు చేసి తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో తిలక్‌ వర్మ సంచలన బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ ఒక్క పరుగుకే ఔటవగా.. హార్దిక్‌ పాండ్యా (18), రింకూసింగ్‌ (8), బ్యాటర్‌గా గ్రౌండ్‌లోకి తొలిసారి అడుగుపెట్టిన రమణ్‌దీప్‌ సింగ్‌ (15) పర్వాలేదనిపించారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగిన ప్రొటీస్‌ భారత్‌ను స్కోర్‌ చేయకుండా అడ్డుకోలేకపోయారు. అండిల్‌ సిమెలేన్‌, కేశవ్‌ మహారాజ్‌ రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్‌ ఓ వికెట్‌ తీశాడు.

Also Read: SA vs Ind Live T20I Live:  కసి తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో భారత్‌ ఘోర వైఫల్యం

 

ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్‌ వరకు పోరాడి ఓటమి వైపున నిలిచింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమై 11 రన్స్‌ తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. భారత్‌ బౌలింగ్‌లో తడబడడంతో ప్రొటీస్‌ బ్యాటర్లు రఫ్పాడించారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మార్కో జాన్సన్‌ (54) అర్థ శతకం నమోదు చేసి విజయం కోసం ప్రయత్నం చేశాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 41 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలవగా.. రియాన్‌ రికల్టన్‌ (20), రీజా హెండ్రిక్స్‌ (21), ఐడెన్‌ మార్‌క్రమ్‌ (29) పర్వాలేదనిపించారు. బౌలింగ్‌లో భారత్‌ తడబడింది. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ఒకదాశలో మ్యాచ్‌ చేజారుతుందా అనే అనుమానాలు కలిగాయి. అనంతరం ప్రొటీస్‌ ఆటగాళ్లను నిలవరించడంలో బౌలర్లు సఫలమవడంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీశారు. ఫలితంగా మ్యాచ్‌ను సొంతం చేసుకున్న భారత్‌ 2-1తో దక్షిణాఫ్రికాపై ఆధిక్యం సాధించింది. తర్వాత జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో సత్తా చాటితే సిరీస్‌ సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆశాకిరణం తిలక్‌ వర్మ
తెలంగాణ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ఈ మ్యాచ్‌లో తనలోని పరుగుల మిషన్‌ను బయటకు తీశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో కూడా బ్యాట్‌తో సత్తా చాటాలని ప్రయత్నించగా కుదరలేదు. సెంచూరియన్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో మాత్రం తన కలను సాకారం చేసుకుని సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా తిలక్‌ నిలిచాడు. భారత క్రికెట్‌కు భవిష్యత్‌ ఆశాకిరణంలా తిలక్‌ వర్మ నిలుస్తున్నాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును తిలక్‌ సొంతం చేసుకున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
India vs South Africa Highlights: Tilak Varma Maiden Century India Bags Third T20 Against South Africa Rv
News Source: 
Home Title: 

Ind vs SA Live: తిలక్‌ వర్మ తిరుగులేని సెంచరీతో భారత్‌కు రెండో విజయం.. ప్రొటీస్‌పై ఆధిక్యం

Ind vs SA Live: తిలక్‌ వర్మ తిరుగులేని సెంచరీతో భారత్‌కు రెండో విజయం.. ప్రొటీస్‌పై ఆధిక్యం
Caption: 
India Won Third T20I Against South Africa
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తిలక్‌ వర్మ తిరుగులేని సెంచరీతో భారత్‌కు రెండో విజయం.. ప్రొటీస్‌పై ఆధిక్యం
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Thursday, November 14, 2024 - 00:28
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
6
Is Breaking News: 
No
Word Count: 
384