Ketu Nakshatra Parivartan 2024: జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా శని, రాహువు, కేతువులను సూచిస్తారు. అయితే ఈ గ్రహాలు చాలా ప్రమాదకరమైనవిగా కూడా భావిస్తారు. ఈ గ్రహాలు రాశి సంచారం, నక్షత్ర సంచారం, తిరోగమనం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే కేతువు గ్రహం నక్షత్రం చేయబోతోంది. ఇది హస్తా నక్షత్రం రెండవ దశలోకి సంచారం చేయబోతోంది. అయితే రాహువు గ్రహం కూడా శుభస్థానంలో ఉండడంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండడమే కాకుండా కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
గ్రహాలు కాలక్రమేణా ఒక చోటి నుంచి మరో చోటికి సంచారం చేస్తాయి. దీని ప్రభావమే ద్వాదశ రాశులవారిపై పడుతుంది. గ్రహాలను బట్టి అన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే వీటి ప్రభావాల వచ్చే ఎంతో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అన్ని గ్రహాలకు బాస్‌గా వ్యవహరించే సూర్యుడు హస్తా నక్షత్రం నుంచి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం చాలా అరుదుగా నక్షత్ర సంచారం చేస్తూ ఉంటుంది.
హస్తా నక్షత్రంలోనే కేతువు 2025 సంవత్సరం జూలై 20వ తేది వరకు ఉంటుంది. ఈ గ్రహం నక్షత్రం మారడంతో ద్వాదశ రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రకరకాల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
మేషరాశి:
మేష రాశివారికి ఈ నక్షత్ర సంచారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన జీవితంలో కూడా ఊహించని విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. దీంతో పాటు వీరు ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటు వైవాహిక జీవితంలో రొమాంటిక్ సమయం కూడా విపరీతంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
మిథున రాశి:
మిథున రాశివారికి కూడా జీవితంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే వీరికి మతపరమైన విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు వాహనాలతో పాటు కొత్త కొత్త ఆస్తులు, నగలు కూడా కొనుగోలు చేస్తారు. దీంతో పాటు వీరు ఈ సమయంలో శరీరంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. మానసిక ఆనందం కూడా మెరుగు పడుతుంది. అలాగే ఒత్తిడి కూడా విపరీతంగా తగ్గుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter