Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్‌కు వరద ముప్పు.. ఫెంగల్‌ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Review On Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్‌కు ఫెంగల్‌ తుఫాను ముప్పు పొంచి ఉండడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఏపీకి మళ్లీ వరదలు వచ్చినా కూడా ముందే అప్రమత్తం కావాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 30, 2024, 03:17 PM IST
Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్‌కు వరద ముప్పు.. ఫెంగల్‌ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారడంతో సీఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. గతంలో తుఫాన్లు సృష్టించిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాన్‌కు 'ఫెంగల్‌'గా నామకరణం చేయగా.. ఫెంగల్‌ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో తుఫాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏం చేద్దామని చెప్పి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Also Read: Rain Alert: ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ?

అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా  ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.    అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ

తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీమ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లకు సీఎం కోరారు. ఫెంగల్‌ తుఫాన్‌పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని.. నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు.

స్వయంగా పింఛన్ల పంపిణీ
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారురాల ఇంటి వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్‌ నగదు అందించారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శనివారం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.4 వేల వితంతు పింఛన్‌ స్వయంగా అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News