Tiger Attacks incident in Adilabad: ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ ను రెండు పులులు తెగ వణికిస్తున్నాయని చెప్పుకొవచ్చు. ఒకవైపు చలిపులి కాగా..మరోటి మాత్రం పెద్దపులి అని చెప్పుకొవచ్చు. కొన్నిరోజులుగా ప్రజలు ఈ పులి సంచారంతో భయపడిపోతున్నారంట. ఇటీవల మహిళపై దాడిచేసి హతమార్చిన పెద్దపులి.. తాజాగా, మరో రైతుపై దాడిచేసినట్లు తెలుస్తొంది. ఈ ఘటన సిర్పూర్ టీ మండలం దుబ్బగూడలో సంభవించినట్లు తెలుస్తొంది.
పొలం పనులు చేస్తుండగా.. రైతు మీదకు అమాంతం పులి దాడికి పాల్పడింది. దీంతో అతను గట్టిగా కేకలు వేయడంతో అక్కడి వాళ్లు రావడంతో అది అతడ్ని గాయపర్చింది. వెంటనే అంబులెన్స్ లో గాయపడిన సురేష్ ను.. ఆస్పత్రి తరలించి మెరుగైన వైద్యం అందించినట్లు తెలుస్తొంది. మరొవైపు ఇటీవల పెద్దపులి..
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ పులిదాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఉదయం పనికోసం వెళ్లిన మహిళ పత్తి చేనులో పనులు చేస్తుంది. దీంతో పులి అమాంతం దాడిచేసి ఆమెను గాయపర్చింది. తీవ్రరక్త స్రావం అయినట్లు తెలుస్తొంది. చుట్టుపక్కల వారు.. అక్కడికి చేరుకుని.. అరుపులు పెట్టారు. దీంతో పులి పారిపోయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి అప్పటి వరకు చనిపోయినట్లు తెలుస్తొంది.
లక్ష్మి మృతదేహాన్ని తీసుకుని, గ్రామస్థులు కాగజ్‌నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసినా, అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో దీనిపై తెలంగాణ సర్కారు.. తాజాగా, పులి దాడి ఘటనపై స్పందించిన అటవీశాఖ, మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తొంది.
Read more: Viral Video: అందమైన అమ్మాయిలతో భరత నాట్యం చేసిన ఏనుగు..?.. వీడియో ఇదిగో..
ఈ ఘటన మాత్రం.. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో షాక్ కు గురిచేసేదిగా మారిందని చెప్పుకొవచ్చు.అధికారులు సైతం.. బోనులు, ప్రత్యేకంగా అధికారులు, డ్రోన్ల సహాయంతో, పగ్ మార్క్ ల సహాయంలో పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల్ని మాత్రం అలర్ట్ గా ఉండాలని చెప్పినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.