Omega 3 Fatty: ఒమేగా 3 పుష్కలంగా ఉండే ఈ పండు తింటే మీ గుండె సేఫ్.. మెదడు భేష్..

Omega 3 Fatty Acids: మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్ కచ్చితంగా ఉండాలి అంటారు. ఎందుకుంటే వీటితోనే మనకు ఆరోగ్యం. అయితే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యానికి, మెదడు పని తిరిగి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Dec 3, 2024, 07:37 PM IST
Omega 3 Fatty: ఒమేగా 3 పుష్కలంగా ఉండే ఈ పండు తింటే మీ గుండె సేఫ్.. మెదడు భేష్..

Omega 3 Fatty Acids: నాడి వ్యవస్థ తోపాటు కంటి చూపుకి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎంతో మేలు చేస్తుంది. మొత్తంగా చూస్తే మన శరీర ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ ఎంతో ముఖ్యం మీరు ఒకవేళ తీసుకోకపోతే తరచూ నీరసానికి గురవుతారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అంతేకాదు వాపు సమస్య నొప్పులను కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్‌ పెడుతుంది.  ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవడం వల్ల బిపి అదుపులో ఉంటుంది. హృదయ స్పందన కూడా బాగుంటుంది. మెదడు సంబంధిత వ్యాధులు ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వ్యాధులు మీ దరిచేరవు అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవ్వు చేపల్లో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. సాల్మన్, సార్డైన్, మేకరల్ చేపల్లో ఉంటుంది. కనీసం వారంలో ఒక రెండు మూడు సార్లు వీటిని తీసుకోవాలి. అంతేకాదు కొన్ని రకాల గింజలు విత్తనాలు కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వెజిటేరియన్ తినే వాళ్ళకి ఇవి మేలు.

మనదేశంలో సార్డైన్‌, సాల్మన్, హిల్సా చేపలు ఉంటాయి. ఇందులో ఒమేగా ౩ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి... ఇవి కాకుండా కొన్ని రకాల గింజలు విత్తనాలు కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాలి. ఇది బేబీ కంటి, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తగ్గుతే గర్భస్థ సమస్యలు కూడా వస్తాయి. బేబీ తక్కువ బరువుతో పుడతారని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

ఇదీ చదవండి: Rice Bugs: బియ్యం డబ్బాలో పురుగు పట్టిందా? ఈ చిన్ని చిట్కాతో ఎప్పటికీ రావు..

ఆయిస్టార్స్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇందులో జింక్‌ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవచ్చు మంచి స్నాక్ రూపంలో తీసుకోవచ్చు... ఇవి కాకుండా ఎండు చేపల్లో కూడా మెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.. ఇవి మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిని వారంలో రెండు సార్లు డైట్లో చేర్చుకోవాలి.

వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. మ్యాంగనీస్, కాపర్, విటమిన్ ఇ కూడా ఉంటుంది... వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా కలిగి ఉంటుంది.

ఇదీ చదవండి: చలి వేళ ప్రోటీన్ పుష్కలంగా ఉండే 6 పండ్లు.. మీ డైట్ లో తప్పనిసరి..

సోయాబీన్స్ లో కూడా ఫైబర్ తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ కే ఉంటుంది... సోయాబీన్స్ లో విటమిన్ తో పాటు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. అయితే ఈ ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ అది కాదు తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News