Pushpa 2 RGV Review: ‘పుష్ప 2’ పై రామ్ గోపాల్ వర్మ మార్క్ రివ్యూ.. ట్రోలర్స్ కు ఆర్జీవి మార్క్ కౌంటర్..

Pushpa 2 RGV Review: రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలేదు. ఎపుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తారనేది ఎవరు చెప్పలేరు. తాజాగా మరికాసేపట్లో విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో  కూడా తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 4, 2024, 01:24 PM IST
Pushpa 2 RGV Review: ‘పుష్ప 2’ పై రామ్ గోపాల్ వర్మ మార్క్ రివ్యూ.. ట్రోలర్స్ కు ఆర్జీవి మార్క్ కౌంటర్..

Pushpa 2 RGV Review: ఎపుడు ఏదో ఇష్యూపై తనదైన శైలిలో స్పందించడం రామ్ గోపాల్ వర్మ మార్క్ స్టైల్. తాజాగా తెలుగు ప్రేక్షకులందరు ఎంతో ఆసక్తి చూస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ మూవీ తనదైన శైలిలో ఎక్స్ లో తనదైన శైలిలో  స్పందించారు. ఈ సందర్భంగా సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి.. ప్లేట్ ఇడ్లీ రేటును వెయ్యి రూపాయలు పెట్టాడు. సుబ్బారావు అంత రేటు పెట్డడానికి అసలు కారణం.. అతని చేసిన ఇడ్లీలు.. మిగతా వాటి కంటే చాలా గొప్పవని నమ్మడమే.

ఇక వినియోగదారుడు సబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే.. ఆ కస్టమర్ సుబ్బారావు హోటల్ కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప.. ఇంకెవ్వరూ కాదు అంటూ పుష్ప 2 టికెట్ రేట్స్ పెంపు పై ఇండైరెక్ట్ గా మాట్లాడారు. మొత్తంగా ప్రేక్షకులకు సినిమా నచ్చితే చూస్తారు. వారికీ నచ్చకపోతే.. చూడరనే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తంగా పుష్ప 2 టికెట్ రేట్స్ పెంపు వల్ల ప్రేక్షకులు వాళ్లకు నచ్చితే సినిమా ఆదరిస్తారు. లేకపోతే నష్టపోయేది నిర్మాతే అని చెప్పుకొచ్చాడు.

ఇక సుబ్బారావు ఇడ్లీ రేటు కామన్ పీపుల్ కు అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే.. అది సెవెన్ స్ార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదనే ఏడ్చినంత వెర్రితనం అన్నారు. సినిమా అనేది నిత్యావసరం కాదు. ఇష్టమున్నవాడు చూస్తాడు. ఇష్టం లేని చూడడు. పైగా ప్రజలు కూడా నిత్యావసర ధరలు తగ్గించమని కోర్టులో కేసులు వేస్తే బాగుంటుందని పని పాటా లేకుండా కోర్టుల్లో కేసులు వేసేవారికీ చురకలు అంటించారు.  

ఒకవేళ ఏదైనా సినిమా నచ్చితేనే చూస్తారు. సినిమా వాళ్లకు కూడా తెలుసు కదా. ఎక్కువ రేట్స్ పెడితే.. ఫ్యామిలీ ప్రేక్షకులు చూడరనే విషయం వారికీ తెలియదా. ఒకవేళ టాక్ ను బట్టి.. ప్రేక్షకుల స్పందన బట్టి టికెట్ రేట్స్ తగ్గించినా.. తగ్గించవచ్చు.

డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెర్స్ మీద పనిచేస్తుందన్నారు. అన్ని వస్తువుల లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. ప్రజా సేవ చేయడానికి  కాదు. మొత్తంగా లగ్జరీ కార్లుపై.. విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవవని వాళ్లు సినిమా టికెట్ ధరలపై ఎందుకు ఏడుస్తున్నారని ఆర్జీవి కొంత మంది పనీ పాటా లేని వాళ్లను తనదైన శైలిలో సూటిగా ప్రశ్నించాడు.

వినోదం అనేది నిత్యావసరా అనే విషయానికొస్తే..

ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా .. ? ఈ మూడు నిత్యావసరాలకు బ్రాండింగ్ ఉన్నపుడు.. ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకు ఇపుడు పెట్టిన రేట్లు తక్కువే అంటూ నిర్మాతలతో పాటు హీరోకు అండగా నిలబడ్డాడు. అలా అనుొని వారు చూడట మానెయ్యెచ్చు అన్నారు. లేదా రేట్లు తగ్గాకా సినిమా చూసుకోవచ్చు కదా అని చురకలు అంటించారు.
 
మళ్లీ సుబ్బారావు హోటల్ చైన్ విషయం కుస్తే.. ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందన్నారు. దానికి ఫ్రూఫ్ ఏమిటంటే.. సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చొనే చోటు దొరకడం లేదంటూ సినిమాకు టికెట్స్ అమ్మడుపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News