Naga Chaitanya -Sobhita first wedding pic: నాగ చైతన్య, శోభిత ధులిపాల వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్ లోని అనపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం తెలుగు సంప్రదాయాలత.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య.. ఆచారాలు పాటిస్తూ జరుగుతోంది.
మెగా స్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లుఆర్జున్, రానా దగ్గా బాటి, మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్ వంటి ప్రముఖులు సహా వివాహానికి 400 మంది.. అతిథులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా.. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి. శోభిత చక్కగా పసుపు రంగు కాంజీవరం సారీలో కనిపిస్తూ, బంగారు ఆభరణాలతో ముస్తాబయ్యారు. బయటకి వచ్చిన శోభిత.. మొదటి ఫోటోలో పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు కనిపిస్తున్నారు. నాగ చైతన్య తన పంచా, కుర్తాతో పెళ్లి మండపంలో కూర్చో ఉన్న ఫోటో సైతం వైరల్ అవుతుంది.
ఇక ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సైతం ఎప్పుడు వస్తాయని అక్కినేని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. కాగా నాగచైతన్య కి ఇది రెండో వివాహం అనేది తెలిసిన విషయమే. ఇంతకుముందు సమంతాన్ని పెళ్లి చేసుకోగా.. మూడు సంవత్సరాలకి అనుకొని కారణాలవల్ల.. వారిద్దరూ విడిపోయారు.
ఇక ఈ సంవత్సరం ఆగస్టులో నాగచైతన్య, శోభితతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. త్వరలోనే నాగచైతన్య తమ్ముడు అఖిల్ పెళ్లి కూడా జరగనుంది. ఈ విషయాన్ని నాగార్జున ఈ మధ్యనే ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య.. తండేలు చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నుంచి ఈ మధ్యనే విడుదలైన బుజ్జి తల్లి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోపక్క అఖిల్ ప్రస్తుతం వరకు తన తదుపరి సినిమా.. గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: AP Drone System: ఏపీ శాంతిభద్రతల్లో మరో పోలీస్ 'డ్రోన్'.. సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read: Self Help Groups: మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్’ ప్రోగ్రామ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.