Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన దేవర 'డ్యాన్సర్‌'.. తనను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు

Devara Song Insta Reels Driver Lovaraju Meets Nara Lokesh: సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ చేస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ ఆగ్రహానికి గురయిన డ్రైవర్‌ తిరిగి ఉద్యోగం పొందిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగి మంత్రి నారా లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వార్తల వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 4, 2024, 11:05 PM IST
Nara Lokesh: లోకేశ్‌ను కలిసిన దేవర 'డ్యాన్సర్‌'.. తనను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు

Thuni RTC Driver Lovaraju: సరదాగా ఖాళీ సమయాల్లో రీల్స్‌ చేస్తూ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ లోవరాజు ఉద్యోగం ఊడడం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న నారా లోకేశ్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో ఆర్టీసీ డ్రైవర్‌కు తిరిగి ఉద్యోగం లభించింది. తనకు ఉద్యోగం వచ్చేలా చేసిన మంత్రి నారా లోకేశ్‌ను కలిసి ఆ డ్రైవర్‌ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌తో కుటుంబసభ్యులతో డ్రైవర్‌ లోవరాజు కలవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ

విధి నిర్వహణలో ఉండగా దేవర సినిమాలోని పాటకు స్టెప్పులు వేసి సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి కొద్దిసేపు మాట్లాడాడు. తన సస్పెన్షన్ రద్దు చేయించి.. తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేశ్‌ను కుటుంబంతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: AP Wine Shops: ఏపీలో మందుబాబులకు షాక్‌.. రేపు వైన్స్‌ బంద్‌

ఏం జరిగింది
ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీన బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యలో కర్రల లోడ్ ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం.. బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు. ఈలోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి డ్రైవర్‌ లోవరాజు సరదాగా కాసేపు దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో తీవ్ర వివాదం రాజుకుంది. ఆ వీడియో వైరల్ కావడంతో అది చూసిన మంత్రి లోకేశ్‌ మెచ్చుకున్నారు.

అయితే మంత్రి మెచ్చుకునేలోపే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయించారు. లోకేశ్‌ చొరవ వలన ఉద్యోగం వచ్చింది. వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇవ్వడంతో తాజాగా లోకేశ్ ఆ డ్రైవర్‌ను కలిశారు. ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News