Business Ideas : మనం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్, హోటల్స్ వంటి వాటిని చూసి చాలా గర్వపడుతుంటాము. ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటూ ఇలా రెస్టారెంట్స్ నడుపుకుంటూ బాగా సంపాదిస్తున్న భారతీయులు కూడా ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఉన్నారు. అయితే ఓ వ్యక్తి ఫ్రాన్స్ నుంచి చదువుకునేందుకు ఇండియాకు వచ్చాడు. ఇప్పుడు ఏడాదికి రూ. 50కోట్లు సంపాదిస్తూ వార్తల్లో నిలిచాడు. ఫ్రాన్స్ ఇండియాకు వచ్చిన ఆ వ్యక్తి బిజినెస్ ప్రారంబించాలన్న ఆలోచన ఎలా వచ్చింది. ఒక ఐడియాతో కోట్లు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం.
చదువుకునేందుకు భారత్‌కు వచ్చిన ఓ ఫ్రెంచ్ వ్యక్తి బెంగళూరు ఫుడ్ వరల్డ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాడు. గౌర్మెట్ శాండ్‌విచ్ చైన్ పారిస్ పానిని వ్యవస్థాపకుడు నికోలస్ గ్రాస్‌మీ రూ. 50 కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది చాలా మందిని తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేలా ఆకర్షిస్తుంది. GrowthX, YouTube ఛానెల్‌లోని ఇటీవలి వీడియో నికోలస్ గ్రోస్మీ ఒక విద్యార్థి నుండి ఆహార వ్యాపారవేత్తగా చేసిన ప్రయాణాన్ని చక్కగా చూపించింది.
22ఏళ్ల వయస్సులో మాస్టర్ డిగ్రీ చేసేందుకు భారత్ కు వచ్చాడు. అయితే ఇప్పుడు నెలకు రూ. 4కోట్ల కంటే ఎక్కువనే సంపాదిస్తున్నాడు. ఎంతో మంది యువతకు ఇప్పుడు నికోలస్ గ్రాస్మీ ఆదర్శమయ్యాడు.
భారత్ లో చదువు పూర్తి చేసిన తర్వాత 2015లో ఫుడ్ ట్రక్ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించాడు నికోలస్. తన తల్లికి వంటి చేయడంలో చిన్నప్పుడు నికోలస్ సహాయపడేవాడట. ఆ విధంగా ఫుడ్ బిజినెస్ పై అతనికి ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం బెంగళూరులో 8 డైనింగ్ అవుట్ లెట్స్, 7 క్లౌడ్ కిచెన్స్ రన్ చేస్తున్నాడు. ఫుడ్ ట్రక్ ద్వారా ప్రారంభమైన ఈ బిజినెస్ నేడు నగరం మొత్తం విస్తరించింది.
ఓ సాధారణ కుటుంబం వచ్చిన నికోలస్ కు చిన్నతనం నుంచే శాండ్ విచ్ అంటే చాలా మక్కువ. దీంతో వీటిని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. అదే ఈరోజు నికోలస్ ను కోట్లు సంపాదించేలా చేసింది. శాండ్విచ్ సేల్స్ దాదాపు 70శాతం ఆన్ లైన్లో జరుగుతాయని..మిగిలిన 30శతం మాత్రమే ఆఫ్ లైన్లో జరుగుతాయని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూ
స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.