Legally Veer: తెలుగు తెరపై మరో రియల్ కోర్ట్ డ్రామా మూవీ ‘లీగల్లీ వీర్’.. అదిరిపోయిన గ్లింప్స్..

Legally Veer: తెలుగు తెరపై కోర్టు డ్రామా నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి. దాదాపు మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘లీగల్లీ వీర్’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో వీర్ రెడ్డి ముఖ్యపాత్రలో నటించారు. రవి గోగుల దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2024, 07:19 AM IST
Legally Veer: తెలుగు తెరపై మరో రియల్ కోర్ట్ డ్రామా  మూవీ ‘లీగల్లీ వీర్’.. అదిరిపోయిన గ్లింప్స్..

Legally Veer: సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై  స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం ‘లీగల్లీ వీర్’. శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా ఈ సినిమాను వ్యవహరించారు. రవి గోగుల డైరెక్ట్ చేస్తున్నారు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ మేరకు హీరో, వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి ఫిల్మ్  బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు.  కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ సమయంలో నాకు మూవీ వాళ్ళతో కాస్త పరియాలు ఏర్పడ్డాయి. బెస్ట్ చిత్రం చేద్దాం అనుకున్నాను. లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం ఈజీగా  అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ చిత్రాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. యాక్టింగ్ కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్నాను. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా గొప్పగా వచ్చింది. డిసెంబర్ 27 ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాము.   

డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్  నాకు ఇచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకొని ఈ సినిమా చేశాను. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ఆదరించాలన్నారు.

కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్ మాట్లాడుతూ..  ‘నిర్మాత వీర్  చాలా కూల్‌గా ఉంటారు.ఇందులో నేను ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాను.అది చాలా బాగా వచ్చింది.

నటుడు గిరిధర్ మాట్లాడుతూ.. ‘కొత్త టీం అయినా కూడా సినిమాని చాలా బాగా అద్భుతంగా తెరకెక్కించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదని ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో వీర్ రెడ్డి టైటిల్ రోల్లో నటించారు.  దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్, జబర్దస్త్ అప్పారావు, జయశ్రీ రాచకొండ, కల్పలత, లీలా శాంసన్, మిర్చి హేమంత్, ప్రీతి సింగ్, వీర శంకర్, వినోద్ నటించారు.

సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రవి గోగుల దర్శకత్వం వహించారు. జాక్సన్ జాన్సన్ ఈ సినిమాను నిర్మించారు. శంకర్ తమిరి సంగీతం అందించారు. ఎస్ బి ఉద్ధవ్ ఎడిటర్ గా వ్యవహరించారు. శివ చైతన్య రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. శ్యామ్ కాసర్ల సాహిత్యం అందించారు.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News