ముంబై: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా వైరస్, దాని బారిన పది మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. చైనాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో మరణాలు చైనాలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పందిస్తూ.. చైనాలో కరోనా వైరస్ నానాటికీ వ్యాపిస్తుండడం తనను ఎంతో కలచివేసిందని, చైనాలో వాస్తవ పరిస్థితులను తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని, బాధతో గుండెలు బరువెక్కాయని అన్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన చైనా ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అమీర్ ఖాన్ ఓ వీడియో సందేశం వెలువరించారు.
@aamir_khan message to people of China regarding #CoronaVirus #AamirKhan #LaalSinghChaddha pic.twitter.com/NOuwdfEwDd
— . (@Prince_PK_AK_) February 21, 2020
కరోనా బారి నుండి చైనా త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. చైనాలో ప్రస్తుతం ఎంతో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా, మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని అయన పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..