Chiranjeevi - Balakrishna: మెగాస్టార్ చిరంజీవి 69 యేళ్ల ఏజ్ లో యంగ్ కథానాయకులతో ధీటుగా సినిమాలు చేస్తున్నారు. వరుస చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వయలెన్స్ చిత్రం చేస్తున్నారు. నాని సమర్పణలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాకు ఓకే చేసినట్టు సమాచారం. అది కూడా బాలయ్య, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
అనిల్ రావిపూడి ఇప్పటికే బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు. మరోవైపు వెంకటేష్ తో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. త్వరలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
వెంకటేష్ సినిమా తర్వాత చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే చిరంజీవికి కథను చెప్పి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను భగవంత్ కేసరి సినిమాను నిర్మించిన సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాను ముందుగా జనవరి 10న రిలీజ్ చేద్దామననున్నారు. కానీ అనూహ్యంగా ‘గేమ్ ఛేంజర్’ రాకతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే యేడాది మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఇక చిరు బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన టీజర్ కు అంతగా రెస్పాన్స్ దక్కలేదు. దీంతో చిత్ర యూనిట్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.